ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాక్సాఫీస్ ఓ ఊపు ఊపేసిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా షూటింగ్ జరుగుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా కూడా ట్వీట్ చేసింది.
అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌లో షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని విషయాన్ని చిత్ర నిర్మాతలు, దర్శకుడు కెమెరా వెనుక స్టిల్‌ను ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ పిక్స్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.