Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ సినీ పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది: పవన్ కళ్యాణ్

Pawan Kalyan
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (15:24 IST)
Pawan Kalyan
69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అని పవన్ కళ్యాణ్ నేడు ప్రకటలో తెలిపారు.  సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయి.  పుష్ప చిత్రానికిగాను శ్రీ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన శ్రీ అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు. 
 
బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ఈ సినిమాకుగాను విజేతలుగా నిలిచిన శ్రీ కీరవాణి, శ్రీ కాలభైరవ, శ్రీ శ్రీనివాస మోహన్, శ్రీ ప్రేమ్ రక్షిత్, శ్రీ కింగ్ సోలోమన్. ఉత్తమ గీత రచయిత శ్రీ చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు శ్రీ దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీ పురుషోత్తమాచార్యులుకీ అభినందనలు. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం సంతోషకరం. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకీ, దర్శకుడు శ్రీ సానా బుచ్చిబాబుకీ అభినందనలు. పలు విభాగాల్లో అవార్డులు కైవశం చేసుకోవడంతోపాటు బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ని నిలిపిన దర్శకులు శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్యలకు ప్రత్యేక అభినందనలు.
 
శాస్త్రవేత్త శ్రీ నంబి నారాయణ్ జీవితాన్ని చూపిన ‘రాకెట్రీ’ చిత్రాన్ని ఉత్తమంగా నిలిపిన దర్శకులు, నటులు శ్రీ ఆర్.మాధవన్ అభినందనలు. ఉత్తమ నటీమణులుగా నిలిచిన శ్రీమతి అలియా భట్ (గంగూభాయ్), కృతి సనన్ (మిమి) ప్రశంసలకు అర్హులు. అదే విధంగా చర్చనీయాంశమైన విషయాలతో రూపొందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ముఖ్యమైన అవార్డులు దక్కించుకొంది. ఆ చిత్ర దర్శకుడు శ్రీ  వివేక్ అగ్నిహోత్రికి అభినందనలు. ఉత్తమ దర్శకుడిగా నిలిచిన మరాఠీ దర్శకుడు శ్రీ నిఖిల్ మహాజన్ (గోదావరి)కీ, ఉత్తమ గాయని శ్రీమతి శ్రేయ ఘోషల్. ఉత్తమ ఛాయాగ్రహకుడు శ్రీ ఆవిక్ ముఖోపాధ్యాయ్, హిందీ చిత్ర సీమ నుంచి అవార్డులకు ఎంపికైన శ్రీ సంజయ్ లీలా భన్సాలీ, శ్రీమతి పల్లవి జోషి, శ్రీ పంకజ్ త్రిపాఠీలకు అభినందనలు. వివిధ భాషల ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల నుంచి ఈ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు తెలియచేస్తున్నాను అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిల్డప్ ఎక్కువ కంటెంట్ తక్కువ గాండీవధారి అర్జున' మూవీ రివ్యూ