Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్కెట్ల రేట్ల గురించి హీరోలకు ఏం పని? ఎపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి. ప్రసాద్

Advertiesment
టిక్కెట్ల రేట్ల గురించి హీరోలకు ఏం పని? ఎపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి. ప్రసాద్
, గురువారం, 30 డిశెంబరు 2021 (20:11 IST)
థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, ఎపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్. పని ఒత్తిడిలో ఉన్న జాయింట్ కలెక్టర్లను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు.
 
నెల సమయమివ్వడం సంతోషమే.. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందన్నారు. కరోనాతో రెండేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఒటీటీ కారణంగా సినీ పరిశ్రమ నష్టాలకు మరో కారణమన్నారు.
 
ప్రభుత్వం నియమించిన కమిటీ కాలయాపన చేయకుండా మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమల గురించి మాట్లాడవద్దని విజ్ఙప్తి చేశారు. హీరోలు థియేటర్ టిక్కెట్ రేట్లపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. నట్టి కుమార్‌ను తెలంగాణాలో ప్రత్యేక ఛాంబర్‌ను పెట్టుకోమనండి అంటూ మండిపడ్డారు.
 
మాతో సంబంధం లేకుండా ఆయన్నే ఎన్నికలను పెట్టుకోమనండి. థియేటర్ల టిక్కెట్ల రేట్లపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. తిరుపతిలోని సుమారు 25కి పైగా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.


ఇటీవల పలువురు ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సినీపరిశ్రమను బాధ పెట్టే విధంగా ఉన్నాయని ఎన్వీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి హీరో నాని క్షమాపణ చెప్పాలన్న నిర్మాత నట్టి కుమార్‌పై ఎన్వీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే నట్టికుమార్‌ను తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు ఆ స‌మ‌స్య తీర‌లేదు