అగ్ర హీరోల సినిమాల్లో సాధారణంగా వర్తమాన రాజకీయా అంశాలు వుంటాయి. ఏ సినిమా తీసుకున్నా రాజకీయనాయకులు, మంత్రులు విలన్లుగా చూపించి ఆ తర్వాత హీరో వారిని భరతం పట్టడడం మామూలే. వకీల్‌సాబ్‌లోనూ అలాంటిదే వుంది. ప్రధానంగా ఇందులో చూపించిన అంశాల్లో పేర్కొనదగింది. బోఫాల్ గేస్ ఉదంతం తరహాలో ఆ మధ్య వైజాగ్‌లో విషవాయు ప్రభావంతో రోడ్డుమీద నడిచేవారంతా పిట్టల్లా రాలిపోయారు. ఆ సందర్భాన్ని వకీల్‌సాబ్ సినిమా కథకు అనుగుణంగా దర్శకుడు పొందుపరిచాడు. తెలంగాణలో అడ్వకేట్‌ను వకీల్‌సాబ్ అంటారు. అందుకే దర్శకుడు ఆ టైటిల్ పెట్టి. హీరో జనంకు న్యాయం జరిగేలా పోరాడతాడు.
- అదేవిధంగా వందల ఎకరాలను వారసత్వంగా వచ్చిన సంపదను పేదలకు ధారాతత్తం చేసి జనంలో ఒకడిగా వారికి న్యాయం జరగాలనే పోరాడుతుంటాడు వకీల్ సాబ్. అలా ఆదివాసీ ప్రాంతాల్లో వున్న ప్రజల సమస్యలపై పోరాడి వారికి న్యాయం చేస్తాడు.\
- మరోవైపు సిటీలో ఎన్నో ఏల్ళుగా వున్న పేదవారిని ఓ రాజకీయ నాయకుడు బలంతంగా అందరినీ కొట్టి ఖాలీ చేయిస్తాడు. దౌర్జన్యాలు చేస్తాడు. ఇంట్లో బియ్యం, ముసలాళ్ళను మంచంపైనుంచి రాజకీయనాయకుడు రౌడీలు విసిరవేస్తారు. అలాంటి సమయంలో సత్యదేవ్ (పనవ్‌కళ్యాణ్) కూడా అదే పేద కాలనీ ఒక ఇంటిలో వుంటాడు. ఆ రౌడీలు ఆ ఇంటిలోకి వచ్చి వస్తువులు చిందవందర చేస్తారు. గోడమీద వున్న వివేకానందుని ఫొటో విసిరేస్తారు. ఆ సమయంలో ఓ చేయి వచ్చి కిందపడకుండా పట్టుకుంటుంది. ఆ చేయే పవన్ కళ్యాణ్. అలా ఇంట్రడక్షన్ వుంటుంది. ఆ రౌడీల భరతం పట్టి, ఆ ప్రజలకు న్యాయం చేస్తాడు.
- ఇక ఫైనల్‌గా కథలోని పాయింట్ ఓ ఎం.పి. కొడుకు అరాచకం. మహిళలపై దౌర్జన్యం, దుర్భాషలాడడం, కిడ్నాప్ చేయడం వంటి అంశాలు. ఇవన్నీ చేసి తాను అమాయకుడిననీ మహిళలే తనను రెచ్చగొట్టారనీ, వారు వ్యభిచారుణులనే ముద్రవేస్తాడు. ఇది నిజంకాదని వకీల్‌సాబ్ నిరూపించేదే సినిమా.
- ఇక సినిమాలో వున్న అంశాలను బేరీజువేసుకుని నిర్మాత దిల్‌రాజు సినిమా విడుదలకు ముందు నెక్ట్స్ లెవల్‌లో వుంటుంది వకీల్‌సాబ్ అన్నారు. ఇక విడుదల తర్వాత అభిమానిగా నేను కాగితాలు చింపి విసిరేశాను అనడం విశేషం.
- కనుక ఈ అంశాలు సహజంగానే అభిమానికి కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా కొంతమంది పెద్దలకు కూడా కనెక్ట్ అయివుంటాయి. కనుకనే తెలంగాణాలో ఎర్నీమార్నింగ్ షోను వేసినా ఆంధ్రలో మాత్రం ఆ షోలను రద్దుచేసింది ప్రభుత్వం.