బిగ్ బాస్-3లో ఒక కంటెన్టెంట్ జాఫర్. మీడియా రంగం నుంచి జాఫర్‌ను సెలక్ట్ చేసి బిగ్ బాస్-3కి తీసుకున్నారు. అయితే కొన్నిరోజులు మాత్రమే ఉన్నారు జాఫర్. చాలా త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. జాఫర్ త్వరగానే బయటకు వచ్చేస్తారని బిగ్ బాస్-3 చూస్తున్న వారందరూ ముందు నుంచి మెసేజ్‌లు చేస్తూ వచ్చారు. అనుకున్న విధంగానే జాఫర్ బయటకు వచ్చేశారు.
అయితే బిగ్ బాస్-3 ముగిసేంతవరకు జాఫర్ ఆ కార్యక్రమం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ రెండురోజుల క్రితం ముగిసిన బిగ్ బాస్-3 ఎపిసోడ్ పైన మాత్రం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జాఫర్. అసలు బిగ్ బాస్ షోపై నాకు తెలిసి చర్చ అనవసరం. సమాజానికి ఉపయోగం లేని షో అది. అది ఏమీ పెద్ద గొప్ప షో కాదు.. విభిన్నమైన షో మాత్రమే.
కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న బిజినెస్ గేమ్. టిఆర్‌పి గేమ్ షో. ఏడు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సీజన్ -3 రేటింగ్స్ వచ్చాయని వారే మాటివి యాజమాన్యమే ప్రకటన చేసింది. ఈ షో మొత్తం నిర్వాహకులకు లాభం.. కంటెన్టెంట్‌లుగా మాకు లాభం.. అంతేతప్ప ఈ కార్యక్రమం వల్ల సమాజానికి అస్సలు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు జాఫర్.