Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Advertiesment
J.D. Lakshmi Narayana, Suresh babu, joshna, Dhanya balakrishna

చిత్రాసేన్

, సోమవారం, 27 అక్టోబరు 2025 (17:47 IST)
J.D. Lakshmi Narayana, Suresh babu, joshna, Dhanya balakrishna
దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై  జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ కి  కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
 
మాజీ సిబిఐ జే.డి. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయమని చెబుతుంటాను. అలాంటి పాషన్ తో వర్క్ చేస్తున్న దేవన్ ని చూసిన తర్వాత ఎలాగైనా ఈ అబ్బాయిని సపోర్ట్ చేయాలనిపించింది. రామానాయుడు గారు తెలుగు సినిమాకి చేసిన సేవలు అమోఘం ఆయన మూవీ మొఘల్. చదువుకున్న రోజుల నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. సురేష్ బాబు గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైటర్ కిరణ్ కుమార్ గారు మాకు మంచి ఫ్రెండ్. ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి. ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
 
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అనిల్ గారు చాలా అద్భుతంగా ఈ స్టోరీ ని రాశారు. చాలా పాజిటివ్ గా ఉంది. నిర్మాత జోష్ణ గారికి బెస్ట్ విషెస్. దేవన్ హీరో గా డైరెక్టర్ గా వస్తున్నారు, చాలా పాషన్ తో తీశారు.  తప్పకుండా సినిమాకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఈవెంట్ కి వచ్చి జెడి గారికి థాంక్యూ. సినిమాకి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.  
 
హీరో దేవన్ మాట్లాడుతూ... హానెస్ట్ గా సినిమా తీస్తే అందరూ సపోర్ట్ చేస్తారని మా కృష్ణ లీల సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. కృష్ణ లీల ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమంటే ఒక త్యాగం ప్రేమంటే ఒక యుద్ధం. మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం వెళ్తాం ఏ స్థాయి వరకు వెళ్తామనేది అసలైన ప్రేమ.  ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా యుద్ధాలు అయినా చేస్తూనే ఉండాలి చివరిగా ప్రేమను గెలిపించడమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమని కృష్ణ లీలలో చాలా వండర్ఫుల్ గా థ్రిల్లింగ్ గా చూపించాం.  ఈ సినిమాకి రండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు.
 
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. చాలా సిన్సియర్ గా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు.  దేవన్ చాలా హార్డ్ వర్క్ తో ఈ ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.  
 
నిర్మాత జోష్నా మాట్లాడుతూ.. మా నటీనటులు టెక్నికల్ టీం చాలా అద్భుతంగా వర్క్ చేశారు. దేవన్  గారు చాలా అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ధన్య చాలా చక్కగా నటించారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌