Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Advertiesment
Vasishta, Anand Ravi, Divi, Sai Rajesh, Vamsi Nandipati, Anil Vishwanth

చిత్రాసేన్

, సోమవారం, 27 అక్టోబరు 2025 (12:24 IST)
Vasishta, Anand Ravi, Divi, Sai Rajesh, Vamsi Nandipati, Anil Vishwanth
నీడ పోయిందని నెపోలియన్ సినిమా రవి  తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. నెపోలియన్ రిటర్న్స్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని దర్న్నాశకుడు వశిష్ట అన్నారు.
 
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌కు వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ వంటి వారు గెస్టులుగా విచ్చేశారు.
 
సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘నేను ఇక్కడకు ఆనంద్ రవి కోసం వచ్చాను. నేను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
అనిల్ విశ్వంత్ మాట్లాడుతూ .. ‘ఆనంద్ రవి గారి మొదటి సినిమాకి నేను పని చేశాను. ఆయన నాకు గురువు వంటి వారు. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన తీసుకునే హుక్ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ మూవీ కథ కూడా నాకు తెలుసు. స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. గుప్తా గారి వల్లే ‘పొలిమేర’ కాన్సెప్ట్ పుట్టింది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన సాయి రాజేష్, వశిష్ట, అనిల్ గార్లకు థాంక్స్. ఆనంద్ గారు ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటుగా ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.
 
హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన వశిష్ట, సాయి రాజేష్, అనిల్ గార్లకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు గుప్తా గారెంతో సహకరించారు. ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. నేను అందరికీ తెలుసు. కానీ సరైన సక్సెస్, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్ రిటర్న్స్’తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు. మున్ముందు ఈ మూవీ గురించి మరింతగా తెలియజేస్తాను’ అని అన్నారు.
 
దివి మాట్లాడుతూ ..‘‘నెపోలియన్’ తరువాత ఆనంద్ రవి గారిని కలిశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఆనంద్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ మూవీ గురించి మున్ముందు అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.
 
తారాగణం : ఆనంద్ రవి, దివి, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవివర్మ, నరసింహ, బెజయవాడ బాబీ అక్క, మీసాల లక్ష్మణ్, రమణ భార్గవ్, కేదార్ శంకర్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్