ప్రముఖ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను నూటికి నూరు శాతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సీఎంగా చూడాలని అనుకున్నానని ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడని లక్ష్మీనారాయణ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ అంటే తాతగారు స్థాపించిన పార్టీ అంటారని ఎన్టీఆర్ తెలంగాణ లేదా ఆంధ్రకు సీఎం కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ మై సీఎం అని ఉంటుందని ఎన్టీఆర్ కు ఆ ఛరిష్మా ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు.
ఎన్టీఆర్‌లో ఆ పవర్ ఉందని ఎన్టీఆర్‌తో కలిసి అరవింద సమేత సినిమా మాత్రమే చేశానని ఆ సినిమా షూటింగ్ సమయంలో నమస్కారం సీఎంగారు అని అన్నానని లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.