అఖండ 2 సినిమాను చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నించారు. క్లాప్ అయ్యాక మా చేతికి రావడానికి చాలా సమయం పట్టింది. అఖండ టైంలో జరిగింది. మాకు ఆ టైంలో కుదరక వేరే నిర్మాత చేయాల్సివచ్చింది. ఆ సినిమా రేంజ్ తో అఖండ 2 కు గట్టిపోటీ వచ్చింది. బాలక్రిష్ణ,బోయపాటి కాంబినేషన్ లో లెజెండ్ సినిమా నిర్మించాం. వీరి కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ హిట్ అనే నానుడి ఇండస్ట్రీలో వుందని 14 రీల్స్ నిర్మాణ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట తెలిపారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు.
- అనిల్ సుంకర తో కలిసి మేం సినిమా చేశాం. కలిసినప్పుడు సక్సెస్ లు వచ్చాయి. ఆయన విడిపోయి వేరు బేనర్ పెట్టాక సక్సెస్ లు తగ్గాయనేది కూడా కరెక్ట్ కాదు. ఎవరి బేనర్ లు వారివి. బాలక్రిష్ణతో ఎలక్షణ్ టైం నుంచి అనుకున్నాం. కానీ గేప్ వచ్చింది. ఓరోజు బాలయ్యగారు మమ్మల్ని పిలిచి సినిమాచేయమని చెప్పారు. దాంతో బోయపాటి కథ చెప్పడం బాగా నచ్చింది.
- ట్రైలర్ లో టెర్రరిజం, అఘోరాలు కనిపించినా కథకు ఏది కావాలో అదే వుంది. కథ మొదట ఎలా చెప్పారో అదే విధంగా వుంటుంది. ఇందులో మిలట్రీ ఎపిసోడ్ కూడా వుంది. అంతా ఆర్గానిక్ గానే వుంటుంది. ట్రైలర్ నే ఏమి చెప్పదలచామో అది చూపించాం. అలాగే ప్రహ్లాద ఎపిసోడ్ కూడా ఏ టైం రావాలో అలా వచ్చి వెళుతుంది.
- అఖండలో పాపకు అభయం ఇచ్చిన తర్వాత అఖండ 2 కథ ప్రారంభమవుతుంది. కథ కోసం మనాలి, లడక్, ఉత్తరాఖండ్, హిమాలయాలు, జార్జియాలోనూ షూట్ చేశాం. ఇండియాలోనే ప్లాన్ చేశాం. కానీ అదే టైంలో టెర్రరిస్టు దాడి జరగడంతో షెడ్యూల్ ను జార్జియాలో షూట్ చేశాం.
ఆగడు ఫెయిల్యూర్ కు దూకుడు సినిమానే.
- ఆగడు సినిమా మేమే చేశాం. కానీ దాని పూర్తిగా ఫెయిల్యూర్ సినిమాగా నిలిచింది. అప్పట్లో సోషల్ మీడియా పెద్దగాలేకపోయినా జనాల్లో దూకుడు సినిమా వచ్చాక ఆగడు రెండో సినిమాగా రావడంతో పెద్ద మైనస్ గా మారింది. ఆగడు ఫెయిల్యూర్ కు దూకుడు సినిమానే. అయితే కొన్ని సినిమాలురిలీజ్ టైంకు చాలామంది చూడలేకపోయారు. ఆగడు, ఖలేజా సినిమాలు కూడా చాలామంది బుల్లితెరపై చూసి మెచ్చుకున్నారు.
ఆస్తాన హీరోలు, దర్శకులు మాకు లేరు
- నిర్మాతలకు హీరోలు దర్శకులు బాండ్ వుంటుంది. కానీ మీరు అలా లేరనిపిస్తుంది. అయితే ఒక బేనర్ తో దర్శకడు హీరో జర్ని చేస్తే వదలడంలేదు. అయితే అప్పటికే హీరోలు, దర్శకులు వేరు కమిట్ మెంట్ వుండడంతో వారితో చేయలేకపోయాం. ఏదిఏమైనా మా ఆస్తాన హీరోలు, దర్శకులు మాకు లేరు. ముందుముందు అలా జరుగుతుందేమో చూడాలి.