Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణ వ్రింద విహారి ఆద‌ర‌ణ‌పై మేము అంతా ఆనందంగా వున్నాం - నాగశౌర్య

sucess cake cutting
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:03 IST)
sucess cake cutting
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.  షిర్లీ సెటియా కథానాయిక.  శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ  నేపధ్యంలో  చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.
 
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంచి సినిమా. థియేటర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు నుండి థియేటర్లు , రెవెన్యూ  పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా వున్నాం. సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ ఇలా అందరూ నటులు చాలా అద్భుతంగా చేశారు. వారితో కలసి చేసిన సీన్స్ కి థియేటర్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ఇచ్చిన దర్శకుడు అనీష్ కృష్ణకు, నిర్మాతైన మా అమ్మకి థాంక్స్. ఛలో తర్వాత గర్వపడే హిట్ ఇచ్చినందు మా అమ్మకి స్పెషల్ థాంక్స్. సినిమాని ఇంకా చూడనివారు థియేటర్ కి రండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పారు.
 
నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ‘కృష్ణ వ్రింద విహారి' సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి కృతజ్ఞతలు. ఈ సినిమాపై మొదటి నుండి చాలా నమ్మకంతో వున్నాం. ఆ బలమైన నమ్మకంతోనే నాగశౌర్య పాదయాత్ర కూడా చేశారు. ఈ పాదయాత్రకి ఎంతగానో సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి, పీఆర్ టీంకి, పాదయాత్రలో మా వెంటనడిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ‘కృష్ణ వ్రింద విహారి' ఫ్యామిలీతో అందరూ కలసి థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఒక రెండు గంటల పాటు అన్ని ఒత్తిళ్ళు పోగొట్టి మనసుని హాయితో నింపే సినిమా ఇది. థియేటర్ కి వచ్చిన అందరూ చాలా ఎంజాయ్ చేశారు. దసరా సెలవలు కూడా వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు మీ ప్యామిలీతో కలిసొచ్చి సినిమా చూసి ఆనందించాలి'' అని కోరారు
 
దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ మాట్లాడుతూ..  ‘కృష్ణ వ్రింద విహారి' డీసెంట్ ఓపెనింగ్స్ తో మొదలైయింది. శుక్రవారం కంటే శనివారం 36 శాతం రెవెన్యు పెరిగింది. ఆదివారం ఇంకో 20 శాతం పెరిగింది. రెవెన్యూ స్టడీగా కొనసాగుతోంది. సినిమాని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగశౌర్య గారికి స్పెషల్ థాంక్స్. రాధిక గారితో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు. ఈ వేడుకలో రాహుల్ రామకృష్ణ, సత్య, హిమజ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్న త్యాగాన్ని తెలియ‌జెప్పే నాన్నంటే చిత్రం