Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వి.జే సన్నీ సకల గుణాభి రామ వ‌చ్చేస్తోంది

వి.జే సన్నీ సకల గుణాభి రామ వ‌చ్చేస్తోంది
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (16:25 IST)
VJ Sunny, Shree Tej, Veligonda Srinivas, Sanjeeva Reddy, viswak sen and others
వి.జే సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో  సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `సకల గుణాభి రామ`. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకువిడుదలకు సిద్ధమైన  సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రంలో ని పాటలను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమెడియన్ శివారెడ్డి, బిగ్ బాస్ అల్ సీజన్స్ కాంటెస్టెంట్స్  పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు..
 
అనంతరం దర్శకుడు నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, వెలిగొండ శ్రీను నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. తను మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమా తీస్తాడు. ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ ఉన్న రైటర్, డైరెక్టర్ కూడా. .తనకు ఈ చిత్రం మంచి విజ‌యాన్ని ఇవ్వాలి. ఇందులో ఉన్న పాట‌లు చిత్రీక‌ర‌ణ బాగున్నాయి. సన్నీ చాలా బాగా చేశాడని అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ట్రైలర్ చాలా బాగుంది సన్నీని  సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ లో ఉన్న అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది .నా ఫస్ట్ ఫిలిం పటాస్ డైరెక్ట్ చేసేటప్పుడు నుండి వెలిగొండ తో జర్నీ చేస్తున్నాను. తను "అందగాడు" సినిమాను డైరెక్ట్ చేశాడు .ఇప్పుడు తను చేస్తున్న రెండవ వ సినిమా ఇది. రైటర్ గా బిజీగా ఉన్న తను డైరెక్టర్ గా ఎన్నో సినిమాలను  తీయాలని  కోరుతున్నానని తెలిపారు.
 
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ..ఎంతో కష్టపడుతూ క్రియేటివ్ గా ఆలోచించే వారు ఎప్పుడూ సక్సెస్ అవుతారు.సన్నీ బిగ్ బాస్ ద్వారా కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నాడు.ఇందులో తను చాలా చక్కగా నటించాడు.మంచి కథతో వస్తున్న నిర్మాతలకు ఈ సినిమా  పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
 
హీరో  విశ్వక్ సేన్ మాట్లాడుతూ..నేను కూడా నటుడు కావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను.9 సినిమాలకు సెలెక్ట్ అయిన తరువాత కూడా నన్ను రిజెక్ట్ చేసే వారు. తరుణ్ భాస్కర్ అన్న నన్ను గుర్తించి నాకు హీరో అవకాశం ఇచ్చాడు. అలా నేను కూడా స్త్రగుల్ ఫేస్ చేశాను.ఇప్పుడు కూడా నీవు బిగ్ బాస్ కు వెళ్లక ముందే నిన్ను గుర్తించి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకంటే ఎక్కువగా ప్రతి  ఒక్కతెలుగువారి ఇంట్లో నువ్వు ఉన్నావు .ఈ చిత్ర ట్రైలర్ బాగుంది.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంబరు.
 
చిత్ర దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్  మాట్లాడుతూ, ఓ భార్య భ‌ర్త‌ల లవ్ స్టోరీ తీద్దామనుకుని నిర్మాతలకు ఈ కథ చెప్పా. నా వంతు నేను కష్టపడతాను అంటే చేద్దాం  అని ముందుకు వచ్చారు. హీరోయిన్స్ చాలా చక్కగా నటించారు.. కెమెరామెన్‌ నలిని గారు నేను అనుకున్న దాని కంటే ఎక్కువ ఔట్ ఫుట్ ఇచ్చారు. టెక్నీషియన్స్, నటీ నటులు అందరూ  సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.E.I.P.L బ్యానర్ లో నిర్మాతలు ఇంకో వంద మందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
హీరో వి.జె సన్నీ మాట్లాడుతూ, నేను 10th క్లాస్ లో నటన కోసం హైదరాబాద్ కు రావాలని ట్రైన్ ఎక్కితే అది విజయవాడకు వెళ్ళింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను.ఆ తర్వాత నేను విజె గా చేశాను. నాకు వరుణ్ సందేశ్  సినిమా లంటే చాలా ఇష్టం తనతో "హ్యాపీ డేస్" లో రాజేష్ క్యారెక్టర్ చేయాలి. కానీ అప్పుడు మిస్సయ్యాను. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చి మిస్ అయ్యాయి. హుషారులో  చేయాలి కానీ చేయలేకపోయాను. నాకు " కల్యాణ వైభోగమే" సీరియల్ లో నటించే  అవకాశం వచ్చింది.ఆ తర్వాత వెలిగొండ శ్రీనివాస్ అన్న మాత్రం వీడు యాక్టింగ్ చేయగలడని గుర్తించి ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చాడు .ఈరోజు నాకు గ్రేట్ మూమెంట్.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషిని ట్రస్ట్ చేసి ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు వలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథను, నన్ను నమ్మిన నిర్మాతలు  ఒక్క రోజు కూడా ఆలోచించకుండా చేద్దామని ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు..ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి పిలుపు రావడం జరిగింది.బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నన్ను అక్కున చేర్చుకొని నా విజయానికి కారకులయ్యారు వారికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. అనుదీప్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చాడు. అమిత్ త్రివేది గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకోసం "సైకో పిల్లా" సాంగ్ పాడాడు..ఒక మనిషి  ఎంత ఎత్తుకెళ్లినా  కూడా తోటివారికి అండగా నిలబడతాడు అలాంటి వ్యక్తే దర్శకుడు అనిల్ రావిపూడి గారు ,విశ్వక్ సేన్ వారు మమ్మల్ని బ్లెస్స్ చేయఫానికి ఈ ఈవెంట్ కు వచ్చినందుకు ధన్యవాదాలు.ఎంతో మంది  పెద్దలు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ శ్రేయోభిలాషి లతో ఈ స్టేజి మీద షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది..ఇక నుండి మంచి మంచి సినిమాలు చేస్తా మీ అందరికీ పేరు వచ్చేలా ఉంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, సంగీత దర్శకుడుని అయ్యానంటే దానికి ఆర్ పి గారే కారణం. నేను చాలా మంది దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను వారందరికీ నా ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధం చేసుకున్న బోనీ కపూర్- అజిత్‌తో మ‌రో సినిమా