Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాలాక్షిట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Mahesh Chandra, c.kalyan, Nims Srihari Raju and others
, శుక్రవారం, 24 జూన్ 2022 (18:43 IST)
Mahesh Chandra, c.kalyan, Nims Srihari Raju and others
మహేష్ చంద్ర, శ్రీదేవి న‌టిస్తున్న చిత్రం విశాలాక్షి. శ్రీహరి రాజు దర్శకత్వంలో ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి నిర్మిస్తున్నారు. చిత్ర ట్రైల‌ర్ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్  లాంచ్ చేసారు. 
 
ఆయన మట్లాడుతూ.. ఈ విశాలాక్షి సినిమా ట్రైలర్ చూసాక ఇది దెయ్యం సినిమా అని అర్ధం అయ్యింది. దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్ కి వెళ్లిన ఎంతో సాహయం చేసేవారు. వారు రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఆయన వరసగా సినిమాలు తీస్తారు. ఈ చిత్ర నిర్మాతలు ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి అందరూ నా మిత్రులు. వారు సినిమా రంగంలో పెద్ద సక్సెస్ సాధిస్తారు. దర్శకుడైన మహేష్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీహరి రాజుగారికి మహేష్ చంద్ర ఎంతో అండగా నిలిచారు. ట్రైలర్ లో రీ రికార్డింగ్ బాగుంది. ప్రేక్షకులకు భయం అనే అనుభూతి కలిగించిన సినిమాలు హిట్ అయ్యాయి. అదే కోవలో విశాలాక్షి సినిమా కూడా హిట్ అవుతుంది అని ఆశీర్వదించారు.
 
దర్శకుడు నిమ్స్ శ్రీహరి రాజు గారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు మా చుట్టూ కరోనా ఉధృతంగా ఉంది. కరోనా వస్తే సినిమా తియ్యాలనే కల నెరవేరకుండానే వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను. దేవుడి దయ వలన స్నేహితుల సహకారంతో విశాలాక్షి సినిమా తీసాను. ఎడిటింగ్ దశలో డబ్బింగ్ దశలో ఇప్పుడు ట్రైలర్ చూసిన వారంతా చాలాబాగుంది అని అభినందిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో మహేష్ చంద్ర గారి సహకారం మరువలేనిది. ఈ చిత్ర నిర్మాతలు నా మిత్రులే. ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు అని చెప్పారు.
 
మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ నిమ్స్ శ్రీహరి రాజు గారికి అనుభవం లేకపోయినా.. సినిమా మీద పూర్తి అవగాహన ఉంది. అమెరికాలో ఉన్నప్ప్పుడు నాకు కథ చెప్పి పది నిమిషాల నిడివితో ఫోన్ లో షూట్ చేసి ఎడిట్ చేసి, సెండ్ చేసి నాకు చూపించారు. అది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా తీశారు. ఆయనకు నా వంతు సహకారం అందించాను. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటించాను అని చెప్పారు.
 
హీరో సూర్య తేజ, సంగీత దర్శకుడు సంతోష్ కావల, కొరియోగ్రాఫ్ఫ్ర్ సతీష్ రాజ్, కెమెరా మ్యాన్ కుర్ర చింతయ్య ఈ సినిమాకి పని చెయ్యడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజులు మాట్లాడుతూ.. సినిమా మంచి క్వాలిటీతో తీసాం, త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమ్మతమే మూవీ రివ్యూ రిపోర్ట్.. రేటింగ్ ఎంతో తెలుసా?