నటి ఇంద్రజ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోస్‌లలో గెస్ట్‌గా చేస్తుంది. అందులో కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెప్పేసింది. అందులో చాలామంది చేసిన పెర్ ఫార్మెన్స్‌కు కొన్ని నవ్వురాకపోయినా నవ్వాలి కాబట్టి నవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా కొందరు తమ కష్టాల్ని చెప్పుకుని ఏడుస్తుంటారు. వారి చూడగానే ఆర్టిస్టుగా ఫీలింగ్‌ను వ్యక్తం చేయాలి. లేదంటే బాగోదు అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది. కష్టాలు అందరికీ వుంటాయి. కానీ వారు స్టేజీ మీదకు రాగానే ఎక్కువగా బరస్ట్ అవుతారంటూ చెప్పింది.
తాజాగా ఆమె స్టాండప్ రాహుల్ సినిమాలో రాజ్ తరుణ్ తల్లిగా నటించింది. ఇంటి విషయాలు పట్టించుకోని కొడుకును మార్చాలని చూస్తుంది కానీ మారడు. ఇప్పటి యూత్‌కు ప్రతినిధి అన్నమాట. ఈ సినిమా గురించి చెబుతూ, యువతకు కనెక్ట్ అయ్యే విషయాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. సహజంగా పెద్దలు పిల్లలను సరైన దారిలో పెడతారు. ఈ సినిమాపరంగా వర్ష, రాజ్ తరుణ్‌ను సరైన దారిలో పెడుతుంది. పెద్దలేకాదు. యూత్‌కూడా ఇప్పుడు సరైన మార్గంలో వెళుతున్నారు.
అదేవిధంగా సహజీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పారు. అందుకే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూశాక చాలా విషయాలు తెలుసుకుంటారు. మాకూ పురుషులతోపాటు సమానమైన బలమైన పాత్రలు ఇస్తే చేయగల సత్తావుంది. ఆ దిశగా రాయాలని ఈ సందర్భంగా దర్శకులు, రచయితలకు తెలియజేస్తున్నానని అన్నారు.