Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఇంకొక్కడు'లో లవ్‌ పాత్రలో నటించడం ఓ సవాల్‌ అనిపించింది : విక్రమ్

'ఇంకొక్కడు' (ఇరుమురుగన్) చిత్రంలో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్‌లా మారిందని చియాన్ విక్రమ్ చెప్పుకొచ్చాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సైన్స్ ఫిక్

Advertiesment
Vikram speech
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:12 IST)
'ఇంకొక్కడు' (ఇరుమురుగన్) చిత్రంలో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్‌లా మారిందని చియాన్ విక్రమ్ చెప్పుకొచ్చాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఇంకొక్కడు' (ఇరుముగన్). వసూళ్లు బాగానే ఉండటంతో, ఆ చిత్రం బృందం సంబ‌రాల్లో మునిగిపోయింది. 
 
ఈ చిత్రం విజయంపై ఆ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. అత‌డిలో మంచి ప్రతిభ ఉందన్నారు. ఆనంద్ శంక‌ర్ భ‌విష్య‌త్తులో మ‌రింత‌ ఉన్నతస్థాయికి ఎదుగుతారని ఆయ‌న అన్నారు. సినిమాకు కలెక్షన్లు బాగా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. 
 
త‌న‌కు ఈ సినిమాలో నటనపరంగా మంచి పేరు వచ్చింద‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో లవ్‌ పాత్రలో నటించడం త‌న‌కు ఒక సవాలుగానే అనిపించిన‌ట్లు చెప్పారు. ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన ఘనత ఆనంద్ శంక‌ర్‌దేన‌ని అన్నారు. ఆయ‌న‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 
 
ఈ చిత్ర నిర్మాత శిబు తమీమ్ మాట్లాడుతూ త‌మ చిత్రం ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,400 థియేటర్లలో ఆడుతోంద‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో విజ‌యవంతంగా రెండోవారం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంద‌న్నారు. చిత్రం కోసం తాము ప‌డ్డ శ్ర‌మ‌కు త‌గ్గ ఫలితాన్ని ప్రేక్షకులు త‌మకు అందిస్తున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూనమ్ న్యూడ్ షో గుట్టు రట్టు.. ఆ ప్రకటన తర్వాతే పాపులారిటీ ప్లస్ అవకాశాలొచ్చాయ్