పూనమ్ న్యూడ్ షో గుట్టు రట్టు.. ఆ ప్రకటన తర్వాతే పాపులారిటీ ప్లస్ అవకాశాలొచ్చాయ్
హాటెస్ట్ స్టార్ పూనమ్ పాండే ఆమధ్య ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం నగ్న ప్రదర్శన చేస్తానని తెగ గొడవచేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ పోటీల గురించి ఏ విషయం గుర్తున్నా, లేకున్నా పూనమ
హాటెస్ట్ స్టార్ పూనమ్ పాండే ఆమధ్య ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం నగ్న ప్రదర్శన చేస్తానని తెగ గొడవచేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ పోటీల గురించి ఏ విషయం గుర్తున్నా, లేకున్నా పూనమ్ పాండే అనే మోడల్ పేరు మాత్రం అందరికి గుర్తుకొస్తుంది. ఇండియా గెలిస్తే, తాను న్యూడ్ షో చేస్తానంటూ సంచలన ప్రకటనే చేసి రాత్రికి రాత్రే సెలబ్రిటీ జాబితాలో చేరిపోయింది. అప్పట్లో ఆ ప్రకటన ఎందుకు ఇచ్చానన్న విషయం వెనకున్న అసలు నిజాన్ని ఇప్పుడు బయటపెట్టిందీ హాట్ భామ.
తన గురించి అప్పట్లో ఎవరికీ అంతగా తెలియదని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని భావించి, ఆ ప్రకటన చేశానని ''న్యూడ్ షో'' గుట్టు రట్టు చేసిందీ ముద్దు గుమ్మ. ఆ ప్రకటన తరువాత తాను ఊహించనంత పాప్యులారిటీ వచ్చిందని, సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని చెప్పుకొచ్చింది. అయితే, అవన్నీ అందాల ఆరబోతకు చెందినవే కావడంతో, వాటిని వద్దనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టింది. కేవలం మూడు సినిమాల్లో మాత్రమే పూనమ్ పాండేకు తన అందాల విందు చేసే అవకాశం లభించింది.