Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయనిర్మల మనవడు శరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Advertiesment
విజయనిర్మల మనవడు శరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
, సోమవారం, 28 డిశెంబరు 2020 (09:01 IST)
పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల మనవడు శరణ్ 'ది లైట్' కుమార్‌ను కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. మాన్విత, కుశల కుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని నిర్మిస్తున్నారు. దీనికి లియో విలియం సహ నిర్మాతగా, డేవిడ్ సహాయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు శ్రీలత, వెంకట్ మాట్లాడుతూ, "హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. జనవరి, ఫిబ్రవరిలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మంగళూరు, చెన్నైలో చిత్రీకరణ చేస్తాం" అని అన్నారు.  
 
దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. తొలి సినిమా హీరోలా కాకుండా శరణ్ అనుభవజ్ఞుడిలా నటిస్తున్నారు. ఆయన సరసన ప్రముఖ బాలీవుడ్ నటీమణి కథానాయికగా నటించనున్నారు. త్వరలో ఆమె ఎవరనేది వెల్లడిస్తాం. ఎం.ఎం.విలియం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు" అని అన్నారు. 
 
ఈ సినిమాలో 'జెమినీ' సురేష్, 'జబర్దస్త్' త్రినాథ్, సురేంధర్ రెడ్డి, సాహితీ భరద్వాజ్, వెంకట్ రమణ, సతీష్ దాసారం, డా. జి.బి.ప్రసాద్, రాహుల్ రంజన్ షా, కిరణ్ ఎం, ప్రవల్లిక, శ్రీమణి, గోపాల్, హర్ష, మాస్టర్ జ్వలిత్ తదితరులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, కూర్పు: లోకేష్ కుమార్ కడలి, మాటలు: డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేష్ గంగుల, నృత్యాలు: సత్య, ఛాయాగ్రహణం: భరద్వాజ్, సంగీతం: రఘురామ్, సహాయ నిర్మాత: డేవిడ్, సహా నిర్మాత: లియో విలియం, సమర్పణ: మాన్విత, కుశల్ కుమార్ బులేమని, నిర్మాతలు: శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని, రచన-దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే 'ఓబులమ్మ'గా మీ ముందుకు వస్తానంటున్న రకుల్