Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త వైరస్.. సౌదీ అరేబియా సరిహద్దుల మూసివేత.. వారం రోజులు బ్యాన్

Advertiesment
కొత్త వైరస్.. సౌదీ అరేబియా సరిహద్దుల మూసివేత.. వారం రోజులు బ్యాన్
, సోమవారం, 21 డిశెంబరు 2020 (12:46 IST)
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో కొత్త కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను కొనుగొన్న నేపథ్యంలో సౌదీ అరేబియా సరిహద్దులను మూసివేయడంతో పాటు అంతర్జాతీ విమానాలపై వారం రోజుల పాటు బ్యాన్‌ విధించింది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి సౌదీ అరేబియాకు చేరిన ప్రజలందరితో పాటు, కొత్త కరోనా వైరస్‌ వెలుగు చూసిన రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా రెండు వారాల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది.
 
గత మూడు నెలల్లో యూరోపియన్‌ దేశాలను సందర్శించిన వారు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, కెనడా, బల్గేరియాతో పాటు పలు దేశాలు ఇప్పటికే యూకే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
 
అలాగే యూకే, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పన మంత్రిత్వశాఖ సమన్వయంతో ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించినట్లు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్‌ కోకా ట్విట్టర్‌లో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురు, శని గ్రహాలు ఆకాశంలో అలా కలుస్తాయట.. భారత్‌లో సాయంత్రం 6.30 నుంచి..?