వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.
తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ నెల 29న తుఫాన్ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు