Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనలో నాకు నచ్చింది అదొక్కటే... ప్రియుడు విఘ్నేష్

Advertiesment
నయనలో నాకు నచ్చింది అదొక్కటే... ప్రియుడు విఘ్నేష్
, సోమవారం, 21 జూన్ 2021 (11:37 IST)
కోలీవుడ్ ప్రేమజంటల్లో నయనతార - విఘ్నేష్ జంట ఒకటి. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా, చార్టెడ్ విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు.
 
ఈ క్రమంలో దర్శకుడిగా విఘ్నేశ్ .. హీరోయిన్‌గా నయనతార ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగానే ఉన్నారు. ఏ మాత్రం తీరిక దొరికినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నారు. 
 
తాజాగా నయనతార చేసిన 'నెట్రికన్' సినిమాకి విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ కథలో నయనతార అంధురాలిగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్.. ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చాడు. 
 
తన ప్రియురాలు నయనతారకి ఆత్మవిశ్వాసం ఎక్కువనీ, ఆమె ఆత్మవిశ్వాసం చూసి తాను ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొచ్చాడు. ఆమెలోని ఆ బలమైన ఆత్మవిశ్వాసమే తనకి ఇష్టమని అన్నాడు. 
 
ఆమె ఈ స్థాయిలో విజయాలను అందుకోవడానికి కారణం కూడా అదేనని చెప్పాడు. ఆమె తాజా చిత్రమైన 'నెట్రికన్' చాలా బాగా వచ్చిందనీ, ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరడుగుల బుల్లెట్ తో గోపీచంద్‌కు టైం క‌లిసివ‌స్తుందా!