ఆ తారక రాముడితో బసవతారకమ్మ... విద్యాబాలన్ ఫస్ట్ లుక్ అదుర్స్

శుక్రవారం, 21 డిశెంబరు 2018 (09:54 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'కథానాయకుడు', 'మహానాయకుడు' అనే పేర్లతో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ హీరో. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది.
 
ఇందులోభాగంగా, గురువారం రాత్రి బసవతారకమ్మ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది. తారక రాముడితో  బసవతారకమ్మ అనే ట్యాగ్‌తో ఈ ఫోటోను ట్విట్టర్‌లో రిలీజ్ జేశారు. బసవతారకం హార్మోనియం వాయిస్తుండగా, ఎన్టీఆర్ ఆమెను ఆసక్తిగా చూస్తున్నాడు. 
 
శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తొలి భాగం సంక్రాంతికి అంటే జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. రెండో భాగం నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు. 

 

ఆ తారకరాముడితో బసవతారకమ్మ..#NTRBiopic #NTR #NandamuriBalakrishna #Vidyabalan @DirKrish @NANDAMURIKALYAN @RanaDaggubati @vishinduri @mmkeeravaani @gnanashekarvs @sahisuresh @VaaraahiCC @vibri_media @NBKFilms_#NTRTrailerOnDec21#NTRKathanayakudu#NTRMahanayakudu pic.twitter.com/7FaIiuPdxk

— NBK FILMS (@NBKFilms_) December 20, 2018

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మిషన్ "మిహిర" సక్సెస్ అయిందా? : 'అంతరిక్షం' మూవీ రివ్యూ ఎలా ఉంది?