Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంచన రీ ఎంట్రీ.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్‌కి బామ్మగా కనిపిస్తారట..

ఒక్కప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్లు అవుతున్నారు. అలాంటి అలనాటి నటీమణులు అమ్మ, బామ్మ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అలనాటి అందాల తారలు సరోజా దేవి వంటి వారు హీరోయిన్లకు బామ్మగా కనిపిస్తుంటే.. తాజ

Advertiesment
Veteran southern actress Kanchana set for comeback after three decades
, మంగళవారం, 29 నవంబరు 2016 (13:34 IST)
ఒక్కప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్లు అవుతున్నారు. అలాంటి అలనాటి నటీమణులు అమ్మ, బామ్మ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అలనాటి అందాల తారలు సరోజా దేవి వంటి వారు హీరోయిన్లకు బామ్మగా కనిపిస్తుంటే.. తాజాగా మరో అలనాటి అందాల నటి కాంచన దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నటించబోతున్నారు.

77 ఏళ్ల కాంచన శ్రీదత్త దర్శనం అనే తెలుగు సినిమాలో నటించారు. 1985లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'లో కాంచన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా ధ్రువీకరించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాంచన ఆతని బామ్మగా కనిపిస్తారని సందీప్ తెలిపారు. ఈ చిత్రంలో నటించేందుకు కాంచన తొలుత ఒప్పుకోలేదని... ఎంతో కష్టపడి ఆమెను ఒప్పించామని తెలిపాడు. సదీర్ఘ చర్చల అనంతరం నటించేందుకు ఆమె ఓకే చెప్పారని అన్నాడు. ఈ సినిమాలో కాంచనది కీలక పాత్ర అవుతుందని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంభకు తోడుగా స్నేహ.. బుల్లితెర డ్యాన్స్ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తారట..