Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంభకు తోడుగా స్నేహ.. బుల్లితెర డ్యాన్స్ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తారట..

రంభ, స్నేహా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సినీ ఛాన్సుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్నేహ- రంభ ఇద్దరికీ పెళ్ళి అయి పిల్లలున్నారు. కాకపోతే రంభ విడాకులు పొందాలని చూస్త

Advertiesment
Sneha To Join The Panel of Judges For This Dance Show
, మంగళవారం, 29 నవంబరు 2016 (13:02 IST)
రంభ, స్నేహా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సినీ ఛాన్సుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్నేహ- రంభ ఇద్దరికీ పెళ్ళి అయి పిల్లలున్నారు. కాకపోతే రంభ విడాకులు పొందాలని చూస్తోంది. స్నేహకు అలాంటి ఆలోచన లేదు. రంభ మాత్రం వెండితెర కన్నా బుల్లి తెరే బెటర్‌ అనుకుంది. ఓ ఛానల్‌లో డ్యాన్స్‌ కాంపీటీషన్‌కు జడ్జిగా వ్యవహరించేందుకు సిద్ధమైపోయింది. 
 
ఈ షోకు మరింత క్రేజ్ తెచ్చేందుకు నిర్వాహకులు స్నేహను కూడా రంగంలోకి దింపారు. దీంతో రంభతో పాటు స్నేహ కూడా ఈ కాంపిటిషన్‌కు జడ్జిగా వ్యవహరిస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు ఉంది అంటున్నారు సినీ జనాలు. రంభ అయితే మంచి డ్యాన్సర్‌ కాబట్టి జడ్జిగా నూటికి నూరుపాళ్ళూ న్యాయం చేయగలదు.

స్నేహకు డ్యాన్స్‌ తెలిసినా అంత పాపులర్‌ కాదు. అలాంటి స్నేహ డ్యాన్సులు చూసి ఎలా జడ్జిమెంటు ఇవ్వగలుగుతుందని సినీ జనం అనుకుంటున్నారు. కాగా స్నేహా, రంభ కలిసి ఆనందం తమిళ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిప్‌లాక్ కిస్ పెట్టినందుకు అన్నతో బూతులు తిట్టించుకున్న హీరోయిన్ ఎవరు?