Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

Advertiesment
Ambika krishna and award team

దేవీ

, గురువారం, 27 మార్చి 2025 (17:56 IST)
Ambika krishna and award team
డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని సత్కరించేందుకు నిర్వహించిన 'VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025' వేడుక . ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో వీబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  'VB ఎంటర్టైన్మెంట్స్' అధినేత ఇంకా 'ఈసీ మెంబర్ ఆఫ్ మా' అయిన విష్ణు బొప్పన ఫౌండర్ గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో విజేతలు అవార్డులు అందుకుని, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజేతలకు సీనియర్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందాయి. 
 
ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ గారు మాట్లాడుతూ.. విజేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్ మీడియా కంటే డిజిటల్ మీడియా ఇంకా బాగా అభివృద్ధి చెందింది అన్నారు. డిజిటల్ మీడియా ప్రజలకు ఇంకా ఎన్నో మంచి వార్తలు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. అలాగే విష్ణు గారి గురించి కూడా ఈ సందర్బంగా మాట్లాడారు. ఆయన చేసిన మంచి పనులని తెలియజేశారు. గత 10 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు విష్ణు ఎన్నో విధాలుగా సాయపడ్డారని గుర్తు చేశారు. అనాధ పిల్లలకు అండగా నిలిచారని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సోషల్ ఎవెర్నెస్ కల్పించిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని అభినందించారు.
 
అనంతరం విష్ణు గారు మాట్లాడుతూ.. ముఖ్య అతిధులుగా విచ్చేసిన పెద్దలు అంబికా కృష్ణ, KS రామారావు గార్లకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం పేద పిల్లలకి సాయం చెయ్యడానికి తనకి తోడుగా వస్తున్న స్పాన్సర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
 విజేతల వివరాలు:రవి శంకర్ (తెలుగు వన్) - బెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఛానల్ అవార్డు
 సుమన్ (సుమన్ టీవీ) - బెస్ట్ డిజిటల్ మీడియా ఛానల్ అవార్డు
జాఫర్ (ఇట్లు మీ జాఫర్) - టీఎన్ఆర్ మెమోరియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
రోహిత్ (ఆర్‌టీవీ) - బెస్ట్ పాపులర్ యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ప్రభు (సుమన్ టీవీ) - బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
వీఎస్ఎన్ మూర్తి (గ్రేట్ ఆంధ్ర) - బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
నాగరాజు (ఇట్స్ యూ టీవీ) - బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
అంజలి (ఐడ్రీమ్) - బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
బీఎస్ (ఎస్ టాక్ షో) - బెస్ట్ డిజిటల్ మీడియా యాంకర్ (మేల్) అవార్డు 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య