Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెన్షన్లో మహేష్‌ డైరెక్టర్, ఇంతకీ ఏమైంది..?

Advertiesment
టెన్షన్లో మహేష్‌ డైరెక్టర్, ఇంతకీ ఏమైంది..?
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (23:08 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఇందులో మహేష్‌ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించగా కీలక పాత్రను అల్లరి నరేష్ పోషించారు. ఇందులో మహేష్‌ బాబు రిషి అనే పాత్రను పోషించారు. గెలుపు కోరుకునే వాడు మనిషి.. ఆ గెలుపు పంచేవాడు మహర్షి అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మహర్షి కథలో రైతు ఆత్మహత్యలు అనే సోషల్ ఇష్యూ లేవనెత్తి పెద్ద ప్రయోగమే చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి.
 
మహర్షి సినిమా కమర్షియల్‌గా సక్సస్ అవ్వడంతో పాటు మంచి పేరు తీసుకురావడంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలనుకున్నారు మహేష్‌ బాబు. అయితే.. స్టోరీ లైన్ ఓకే అయ్యింది. ఇక సమ్మర్లో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుండగా.. ఫుల్ స్టోరీ నేరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబుకి పూర్తి సంతృప్తి కలిగించకపోవడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసాడు. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. 
 
అయితే.. వంశీ పైడిపల్లికి దిల్ రాజుతో మంచి అనుబంధం ఉంది. అందుచేత దిల్ రాజు వంశీ పైడిపల్లికి సినిమా కన్ఫర్మ్ చేయించాలని తన వంతుగా ప్రయత్నం చేసినప్పటికీ... వర్కవుట్ కాలేదని తెలిసింది.
 
 ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకుంటే, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు. అందుచేత ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామంటే.. ఆయన ఖాళీగా లేరు. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేద్దామనుకుంటే... సుకుమార్‌తో పుష్ప సినిమా చేస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్‌లో బన్నీ ఇంకా పాల్గొనలేదు. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్‌తో ఐకాన్ మూవీ చేయనున్నాడు. అందుచేత బన్నీతో సినిమా చేద్దామంటే.. బన్నీ కూడా ఖాళీగా లేడు.
 
 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేస్తున్నారు. దీని తర్వాత బాబీ డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత క్రిష్‌తో ఓ మూవీ, హరీస్‌ శంకర్‌తో మరో మూవీ చేయనున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ బిజీ. 
 
ఇక రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. అలాగే ఆచార్య మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరితో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుచేత... వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. దీంతో వంశీ పైడిపల్లి బాగా టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి.. ఏ హీరోతో సెట్ అవుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్ డైరెక్టర్‌తో మహేష్ బాబు సినిమా..!