తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తాజా సినిమా వాలిమై. ఈ సినిమా ట్రైలర్ తాజాగా డిసెంబర్ 30న విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ ట్రైలర్ కేవలం 12 గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న ఈ చిత్రం ఈసారి తెలుగులో కూడా విడుదల కానుంది. 
 
									
										
								
																	
	 
	ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపారు. విజువల్స్ బాగున్నాయి. తెలుగు హీరో కార్తికేయ కూడా తన లుక్‌తో అదరగొట్టారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఇక అజిత్ లుక్ కేకపెట్టించే విధంగా ఉంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ట్రైలర్ గ్రాండ్ విజువల్స్‌తో అదిరిపోయింది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.