Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు శిల్పకళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Advertiesment
నేడు శిల్పకళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్
, ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (10:16 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "వకీల్ సాబ్". ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ వేడుకకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు శిల్ప కళావేదికలో ఈ ఫంక్షన్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్టు ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఫ్యాన్స్ పాసులతో రావాలని, మాస్కు లేకపోతే ప్రవేశం నిషిద్ధం అని స్పష్టం చేశారు. 
 
కాగా ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. శనివారం ఆయన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వేడుకలో పాల్గొంటారని చిత్ర యూనిట్ సభ్యుల చెబుతున్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్ చిత్రం పింక్ మూవీని తెలుగులో మార్పులుచేర్పులతో "వకీల్ సాబ్" పేరిట తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలంలోనే మామిడిచెట్ల మధ్య మెయిన్ మ్యాటర్ జరిగేది.. సుడిగాలి సుధీర్.. రష్మీ..?