హిల్లరీ క్లింటన్ ఎంపికపై పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ అలా అన్నదేమిటి...?
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ లేదా హిల్లరీ క్లింటన్ అని తేలిపోయింది. ఇటీవల అమెరికాలో విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించి డెమొ
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ లేదా హిల్లరీ క్లింటన్ అని తేలిపోయింది. ఇటీవల అమెరికాలో విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించి డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు. ఇన్నేళ్ల కాలంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి మహిళ ఎవరూ లేరు. అది హిల్లరీ క్లింటన్ కావడంతో ప్రపంచం అంతా ఉత్సుకతతో చూస్తుంది. ట్రంప్ పైన గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.
ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి మాత్రం ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కల్గించడంలేదు. ట్విట్టర్లో ఈ విషయమై ఆమె ఓ పోస్ట్ చేసి మరోసారి చర్చలోకి వచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నదంటే... నేటివరకూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే అమెరికాలో మహిళ ఇంతవరకూ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించలేదు. చాలా దేశాలు ఈ ఫీట్‌ను ఎప్పుడో దాటేశాయి. కాబట్టి ఇప్పుడు హిల్లరీ అధ్యక్ష పదవి కోసం పోటీపడటంలో ఆశ్చర్యం ఏముందీ అంటూ కామెంట్ చేశారు.