Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణకు బర్త్ డే ట్రీట్: గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ రిలీజ్.. మీరూ చూడండి..!

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాలయ్య బర్త్ డే జూన్ పదో తేదీ కావడంతో.. ఆయన బర్త్ డే కానుకగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్‌డే బసవ

Advertiesment
బాలకృష్ణకు బర్త్ డే ట్రీట్: గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ రిలీజ్.. మీరూ చూడండి..!
, గురువారం, 9 జూన్ 2016 (15:07 IST)
నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాలయ్య బర్త్ డే జూన్ పదో తేదీ కావడంతో.. ఆయన బర్త్ డే కానుకగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్‌డే బసవరామతారకపుత్ర’ అంటూ ‘శాతకర్ణి’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. 
 
బాలకృష్ణ 56వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌కు శాతకర్ణి పోస్టర్ రిలీజ్ బూస్ట్ ఇచ్చినట్లవుతుందని సినీ జనం అనుకుంటున్నారు. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పకుడు. 
 
ఇటీవల మొరాకోలో యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆ సన్నివేశాలను కలగలిపి.. ఫస్ట్ లుక్ పోస్టరుగా విడుదల చేశారు. ఇక త్వరలో ఈ మూవీ మూడో షెడ్యూల్ ప్రారంభం కానుండగా, బాలయ్యకు హీరోయిన్ కూడా ఖరారైంది. శ్రేయ ఇందులో కథానాయికగా నటించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైనా అమలా పాల్‌కు తగ్గని క్రేజ్.. అమ్మా కనక్కులో లుక్ అదుర్స్ (వీడియో)