Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊరు పేరు భైరవకోన సినిమాపై కోర్టులో కేసు- విడుదల అయ్యేనా !

Uru Peru Bhairavakona

డీవీ

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (16:19 IST)
Uru Peru Bhairavakona
"ఊరు పేరు భైరవకోన" సినిమా విడుదలను నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేశారు.  అడ్వంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్  అధినేతలు, ప్రముఖ  నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) చెప్పుకొచ్చారు,
 
ఆ మధ్య వచ్చిన "ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి,, నా వద్ద నుంచి  30 కోట్ల రూపాయలు తీసుకుని, అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వారు నన్ను మోసగించారు. మూడు రాష్ట్రాలకు కాకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందు నా డబ్బులు చెల్లిస్తామని, లెటర్ అఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కాను అని చెప్పారు
 
తన డబ్బులు ఇచ్చేంతవరకు సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోరుతూ...ఆ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో (OS NO: 658/ 2024) కేసు వేసిన నేపథ్యంలో గురువారం వాదనలు జరగనున్నాయని బత్తుల సత్యనారాయణ చెప్పారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెర్లిన్‌కు బయల్దేరిన పుష్ప నటుడు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?