మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విభిన్న ప్రేమకథా చిత్రం ఉప్పెన. ఈ చిత్రం ద్వారా కథానాయిక కృతి శెట్టి, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తుండడంతో టీమ్ అంతా సక్సస్ పైన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఖచ్చితంగా ఉప్పెన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, బుచ్చిబాబు సానాకు మంచి పేరు తీసుకువస్తుందని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు.
అయితే.. ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎనౌన్స్ చేసినట్టుగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సినిమా హాల్స్, షూటింగ్స్ ఆపేయడం తెలిసిందే.
మార్చి 31 వరకు సినిమా హాల్స్ బంద్. ఏప్రిల్ 1 నుంచి సినిమా హాల్స్ ఓపెన్ చేసినప్పటికీ.. జనాలు థియేటర్స్‌కి రావడానికి టైమ్ పడుతుంది. మరో వార్త ఏంటంటే.. సినిమా హాల్స్ బంద్ అనేది మార్చి 31 నుంచి మరో వారం పొడిగించే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. అందుచేత ఏప్రిల్ 2న ఉప్పెన రిలీజ్ కావడం లేదని సమాచారం. ఇక ఉప్పెన లేటెస్ట్ రిలీజ్ డేట్ విషయమై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... క్రియేటివీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఆర్య. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.
ఈ సినిమాలో వన్ సైడ్ లవ్ గురించి కొత్తగా చూపించి సుకుమార్ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాడు.
దీంతో తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాని మే 7న రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ డేట్ సుకుమార్‌కి బాగా కలిసొచ్చింది. అందుకనే అనుకుంటా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ తొలి సినిమా ఆర్య రిలీజైన రోజునే ఉప్పెన సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
మరి.. మే 7 డేట్ డైరెక్టర్ సుకుమార్‌కి కలిసొచ్చింది. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానాకి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.