Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దండుపాళ్యం' దర్శకుడి తాజా బ్లాక్ బస్టర్ 'బ్రాహ్మణ'.. ఇద్దరు భామలతో ఉపేంద్ర

Advertiesment
Upendra
, బుధవారం, 15 జూన్ 2016 (17:24 IST)
"దండు పాళ్యం" చిత్రం అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాజు మన తెలుగువాడన్న విషయం కూడా తెలిసిందే. "దండుపాళ్యం" అనంతరం శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొందిన "శివం" చిత్రం సైతం అంతే సంచలనం సృష్టించింది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. 
 
సి.ఆర్.మనోహర్ సమర్పణలో విజి చెరిష్ విజన్స్, శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్ గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారథ్యం వహించడం విశేషం. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. "కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు తెలుగులో గల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. "దండుపాళ్యం" ఫేం శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో రూపొంది.. కన్నడలో ఘన విజయం సాధించిన "బ్రాహ్మణ" తెలుగులోనూ డెఫినిట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ ద్వారా ఆంధ్ర - తెలంగాణాలలో అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం" అని చెప్పారు. 
 
రవిశంకర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన "బ్రాహ్మణ" చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట ప్రసాద్, ఎడిటర్: వినోద్ మనోహర్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: గుంటూరి కేశవులు నాయుడు, సమర్పణ: సి.ఆర్.మనోహర్, నిర్మాతలు: విజయ్.ఎం- గుర్రం మహేష్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాజు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఉంటే కెమిస్ట్రీ సులభంగా వ‌ర్క‌ౌట్ అవుతుంది: అదితి సింగ్