ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఉంటే కెమిస్ట్రీ సులభంగా వర్కౌట్ అవుతుంది: అదితి సింగ్
ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన ఒక అందమైన ప్రేమకథా చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ చిత్రం సెన్సార్ అయి, వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. ఇటీవల మార్కెట్‌లోకి విడ
ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన ఒక అందమైన ప్రేమకథా చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ చిత్రం సెన్సార్ అయి, వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో 'గుప్పెడంత ప్రేమ' యూనిట్ అందరి ప్రశంసలు అందుకుంటుంది. సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారగణంగా నటించారు. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ అదితి సింగ్ సినిమా గురించి ముచ్చటించారు. ఆ విశేషాలు..
* ఇదే మొదటి సినిమా కదా..?
అవును. నా మొదటి సినిమా గుప్పెడంత ప్రేమ. సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నా. సినిమాల్లో నటించాలన్న కోరిక అసలు ఎప్పటి నుంచి ఉంది? నా చిన్నప్పటి నుంచి నేనొక హీరోయిన్‌ని కావాలన్న కోరిక మనసులో పడిపోయింది. చిన్నప్పుడు ఎవరైనా మామూలుగా నువ్వేమవుతావని అడిగితే హీరోయిన్‌ని అవుతా అని చెప్పేదాన్ని. సినిమాల ఇంపాక్ట్ అంతగా నామీద ఉంది. ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టపడితేనే సాధ్యమవుతుంది.
* ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
ఎందుకు కష్టపడలేదు. చాలా కష్టపడ్డాను. మొదట్లో నేను 85 కేజీలు బరువు ఉండేదాన్ని. నా ఫోటోలు చూసి డైరక్టర్ వినోద్ బరువు తగ్గితే అప్పుడు చూద్దాం అన్నారు. ఆయన ఆ మాట చెప్పిన వెంటనే సినిమా కోసం బరువు తగ్గి హైదరాబాద్ ఆడిషన్‌కు వచ్చాను. ఆడిషన్‌లో నాతో పాటు ముగ్గురు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లను చూసి నేను ముందు కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నాపై నమ్మకం ఉంది. ఏ పని చేసినా ఫోకస్‌తో చేస్తానని. సో ధైర్యం చేసి ఆడిషన్స్ ఇచ్చేశా.
అలా మొదలైంది సినిమాలో నిత్యా మీనన్ చెప్పే డైలాగ్స్‌ను ఆడిషన్స్‌లో చెప్పా, అది నచ్చి నన్ను ఫైనలైజ్ చేశారు. సినిమా గురించి.. సినిమాలో నా క్యారెక్టర్ పేరు శాండీ. తెలుగు సాంప్రదాయాలను, విలువలను గౌరవించే పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫస్ట్ లవ్‍లో ఉండే స్వచ్ఛమైన ఫీలింగ్స్, ప్రేమ గురించే కథ అంతా నడుస్తుంది. అప్పటివరకు అందరిలానే ఉండే శాండీ జీవితంలోకి హీరో వచ్చిన తర్వాత ఆమెలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నదే కథ.
* సినిమా ఎలా వచ్చింది మరి..?
సినిమా చూశాక మీరే చెప్తారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి చేశారు. అందుకే మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా అంత బాగా నటించగలిగాం. ఏదైనా ఒక పనిని మనం ఇష్టపడి చేస్తే అది ఎంత కష్టమైనా సాధ్యపడుతుంది.
* డైరక్టర్ వినోద్ లింగాలతో పనిచేయడం ఎలా ఉంది?
ఆయన గురించి చెప్పాలంటే, సినిమాకు ఏం కావాలి, ఆ క్యారెక్టర్స్‌కు ఏం కావాలి అని ప్రతి ఒక్కటి బాగా తెలిసిన వ్యక్తి. సినిమాలోని ప్రతి ఒక్కరి నుంచి మంచి నటనను తీసుకోగలిగారు.
* ఆల్రెడీ సినిమాలో తెరంగేట్రం చేసిన సాయి రోనక్‌కు జోడీగా కనిపించారు. అతని పక్కన నటించడం ఎలా అనిపించింది?
సాయి రోనక్, నేను షూటింగ్ టైమ్‌లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ బాగా బలపడటం వలనే సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతలా వర్కవుట్ అయింది.
* మీ కుటుంబం గురించి..
ఢిల్లీలో పుట్టాను, ముంబైలో పెరిగాను. నాన్న జైనేంద్ర ప్రతాప్ బాలీవుడ్ సినిమాల్లో అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి పనిచేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇకపోతే మా అమ్మ.. ఈ సినిమాలో నాకు తల్లిగా నటిస్తుంది.
* తర్వాత ఏమైనా సినిమాలు ఒప్పుకున్నారా..?
ప్రస్తుతానికి ఇంకా ఏమీ సినిమాలు చేయట్లేదు. గుప్పెడంత ప్రేమ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.