Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్ 1న ఐదు భాషలలో ఉపేంద్ర గాడి అడ్డా విడుదల

Kancharla Upendra,  Savitri Krishna
, సోమవారం, 20 నవంబరు 2023 (16:18 IST)
Kancharla Upendra, Savitri Krishna
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన  "ఉపేంద్ర గాడి అడ్డా" చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రకటించారు. తొలుత సినిమా ట్రైలర్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, "సాధారణంగా చిత్రపరిశ్రమలోని వాళ్లు అయినా కొత్తగా పరిశ్రమలోకి వచ్చినవాళ్లు అయినా తమ కుమారులను హీరోలుగా పరిచయం చేస్తూ, ఒకే ఒక్క సినిమాను చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్లు  బయటి నిర్మాతల సినిమాలను చేయడం చూస్తున్నదే. అయితే ఈ చిత్ర నిర్మాత  కంచర్ల అచ్యుతరావు గారు కుమారుడు కంచర్ల ఉపేంద్రను హీరోగా పెట్టి, ఇదే బ్యానర్ లో వరుసగా ఐదు సినిమాలు తీస్తుండటం ఒక సంచలనం, ఒక విశేషం. దీనిని  ఉపేంద్ర నిలబెట్టుకుని, హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి" అని  ఆకాంక్షించారు.  
 
నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, "తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషలలో  డిసెంబర్ 1న ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నాం. మా బ్యానర్ లో మేము వరుసగా తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒకటి చొప్పున  విడుదల చేయబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం లో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము తీస్తున్న సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు వెచ్చించదలచుకున్నాం" అని అన్నారు.
 
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ , "కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి" ' అని అన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ , "మాస్, ఎంటర్టైన్ మెంట్ వంటి అంశాలకు సందేశాన్ని మిళితం చేసి, ఈ సినిమాను తీశాం. సోషల్ మీడియా  నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న పాయింట్ ను ఇందులో చూపించాం"  అని అన్నారు.
 
 హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ, తన కెరీర్ మలుపునకు ఈ సినిమా ఎంతగానో దోహదం చేస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
 
ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి రాము, సినిమాటోగ్రఫీ: రవీందర్ సన్, సహ నిర్మాతలు  కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్.కె.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దేవర' షూటింగులో నటుడు శ్రీకాంత్‌కు గాయం