Publish Date: Mon, 24 Apr 2023 (20:10 IST)
Updated Date: Mon, 24 Apr 2023 (20:13 IST)
మెగా కోడలి ఉపాసన గర్భందాల్చివుంది. దీంతో ఆమెకు పుట్టింటివారు సీమంతం నిర్వహించగా, ఈ వేడుకకు అనేక మంది సెలెబ్రిటీలు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఉపాసన జూలై నెలలో తమ బిడ్డకు జన్మనిచ్చారు.
ఇక ఇటీవల స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్ వేడుక చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి నివాసంలోనూ ఆమె ఈ వేడుకను చేసుకున్నారు. హైదరాబాద్‌లో మరోసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉపాసనకు బేబీ షవర్ ఫంక్షన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు.
ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. 'సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ' అని క్యాప్షన్ రాశారు. అలాగే ఎంతో సరదాగా జరిగిన ఈ వేడుకలో సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్ చరణ్ ఫ్రెండ్స్ కూడా సందడి చేశారు. ఇక ఈ ఫొటోస్ చూసిన అల్లు - మెగా ఫ్యామిలీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.
ఠాగూర్
Publish Date: Mon, 24 Apr 2023 (20:10 IST)
Updated Date: Mon, 24 Apr 2023 (20:13 IST)