అశ్విన్ దూస్రాతో భయంలేదు కానీ.. వేరే అస్త్రంతో వస్తే కష్టమే: కెవిన్ పీటర్సన్
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య నవంబర్ 9 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు ఇరు జట్లు సంసిద్ధమవుతున్న వేళ, టీమిండియాతో పెట్టుకుంటే అంతేనని.. తప్పకుం
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య నవంబర్ 9 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు ఇరు జట్లు సంసిద్ధమవుతున్న వేళ, టీమిండియాతో పెట్టుకుంటే అంతేనని.. తప్పకుండా ఇంగ్లండ్‌పై భారత్ క్లీన్ స్వీప్ చేయనుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అయితే బ్యాట్స్‌మెన్లను భయపెట్టే బౌలర్ అశ్విన్‌పై ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భారత పర్యటనలో అశ్విన్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే మాట నిజమేనని కెవిన్ పీటర్సన్ అంగీకరించాడు. ఇంకా అశ్విన్‌తో ఇంగ్లండ్‌కు ఇబ్బంది తప్పదన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా అశ్విన్‌కు ఉందన్నాడు. అయితే అతని దూస్రాను ఎదుర్కోవడానికి రెడీ అని.. కానీ వేరే అస్త్రంతో వస్తే మాత్రం ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు ఇబ్బంది తప్పదని వెల్లడించాడు.