Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం.. మెహరీన్

నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీర ప్రేమగాథ"తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ తన పుట్టిన

అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం.. మెహరీన్
, శుక్రవారం, 4 నవంబరు 2016 (16:47 IST)
నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీర ప్రేమగాథ"తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ తన పుట్టిన రోజును ఈనెల 5వ తేదీన జరుపుకోనున్నారు. 
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్‌లో క్యాన్సర్ కారణంగా బాధపడుతున్న చిన్నారులను కలిసింది మెహరీన్. వారందరితో కొంతసేపు సరదాగా గడపింది. వారితో ప్రేమగా ముచ్చటించింది. అలా వారిలో నూతనోత్తేజాన్ని నింపింది. 
 
ఈ సందర్భంగా మెహరీన్ మాట్లాడుతూ.. "మానసికంగా, శారీరకంగా భరించలేనంత బాధను గుండెల్లో అణిచిపెట్టుకొని తమ చిరునవ్వులతో ఎదుటివారికి స్ఫూర్తిగా నిలవగల ఈ చిన్నారులతో ఈ విధంగా గడపడం, వారితో కొంత సమయం వెచ్చించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిని చూస్తే ధైర్యం అంటే ఏమిటో అర్థమైంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా" అని చెప్పుకొచ్చింది. 
 
మేహరీన్ కథానాయికగా నటించిన హిందీ చిత్రం "ఫిల్లౌరీ" అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు తెలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ - గోపీచంద్ - నాగశౌర్యలతో రాధామోహన్‌ మూడు కొత్త చిత్రాలు