Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"అక్కడ మాత్రమే యువతిని సెక్సీగా ఉన్నావ్ అనొచ్చు.. లేకపోతే తల తెగిపోతుంది" : ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. ఈమె తాజాగా తన బ్లాగులో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పడక గదిలో మాత్రమే అమ్మాయిని సెక్సీగా ఉన్నావ్ అని చెప్పొచ్చు అని.. మిగి

Advertiesment
Twinkle Khanna
, బుధవారం, 22 మార్చి 2017 (09:24 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. ఈమె తాజాగా తన బ్లాగులో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  పడక గదిలో మాత్రమే అమ్మాయిని సెక్సీగా ఉన్నావ్ అని చెప్పొచ్చు అని.. మిగిలిన ప్రదేశాల్లో అలా కామెంట్స్ చేస్తే తల తెగిపోతుందంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను కూడా టీవీఎఫ్‌ సీఈవో అరునబ్‌ కుమార్‌ను ఉద్దేశించి చేశారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పైగా, ట్వింకిల్‌ అభిప్రాయాన్ని గౌరవిస్తూ.. ‘నా భార్య పంచ్‌లు నాకంటే గట్టిగా ఉంటాయి’ అని హీరో అక్షయ్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇంతకీ ఇంతటి ఘాటైన కామెంట్స్ చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే... 
 
ఇటీవల టీవీఎఫ్‌ సీఈవో అరునబ్‌ కుమార్‌ తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వార్తలకెక్కారు. దీనిపై అరునబ్‌ మీడియా ద్వారా స్పందిస్తూ 'నేను సింగిల్‌. నాకు ఏ యువతైనా అందంగా కనిపిస్తే మీరు సెక్సీగా ఉన్నారు అని కాంప్లిమెంట్‌ ఇస్తా. అది తప్పా?' అంటూ తన ప్రవర్తనను సమర్ధించుకున్నాడు. 
 
దీనిపై ట్వింకిల్‌ ఖన్నా తన బ్లాగ్‌లో అరునబ్‌ను కప్పలతో పోలుస్తూ... ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పడక గదిలో యువతిని సెక్సీగా ఉన్నావు అని చెప్పొచ్చు. కానీ పని చేసేచోట ఓ అమ్మాయిని సెక్సీగా ఉన్నావు అనడం సమంజసం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తల తెగిపోతుంది' అని కాస్త కఠినంగా స్పందించారు. 
 
'ఆఫీస్‌లో ఒక అమ్మాయి నచ్చితే ఆమెని మర్యాదపూర్వకంగా డ్రింక్‌ తాగుతారా అని అడగండి. ఆమె ఒప్పుకోకపోతే అక్కడితో వదిలేసి అదే డ్రింక్‌ తాగి మీ బాధను మర్చిపోండి. అంతేకానీ ఆఫీస్‌లో ఆమెను గమనిస్తుండటం, ముట్టుకోవడానికి ప్రయత్నించడం, తప్పుడు మెసేజ్‌లు పంపడం వంటివి చేయద్దు. ఒకవేళ ఓ అమ్మాయికి కాంప్లిమెంట్‌ ఇవ్వాలనుకుంటే ఆమెకున్న నైపుణ్యాలను గుర్తించి మెచ్చుకోండి. అంతేకానీ ఇలా సెక్సీ అని చెప్పి అది కాంప్లిమెంట్‌ అనడం ఎంతమాత్రం సబబు కాదు.’ అని ట్వింకిల్‌ తన బ్లాగులో రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి బాధను 'గది'లో తీర్చుకుంటున్న నాగ్.. అమలకు తగ్గిన టెన్షన్