Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి బాధను 'గది'లో తీర్చుకుంటున్న నాగ్.. అమలకు తగ్గిన టెన్షన్

చిన్న కుమారరత్నం అఖిల్ పెళ్లి పీటలకు ఎక్కకముందే బ్రేక్ కావడం తండ్రి నాగార్జునను బాగా గాయపర్చింది. ఆ ఘటనతో మానసికంగా ఎంత బాధపడ్డారంటే కొద్ది రోజులు ఇల్లువదిలి బయటకు రాలేదని వార్తలు హల్ చల్ చేశాయి.తన ప్రియతముడి బాధ, ఆవేదన దగ్గరుండి చూస్తూ అక్కినేని అమల

Advertiesment
ఇంటి బాధను 'గది'లో తీర్చుకుంటున్న నాగ్.. అమలకు తగ్గిన టెన్షన్
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (08:53 IST)
చిన్న కుమారరత్నం అఖిల్ పెళ్లి పీటలకు ఎక్కకముందే బ్రేక్ కావడం తండ్రి నాగార్జునను బాగా గాయపర్చింది. ఆ ఘటనతో మానసికంగా ఎంత బాధపడ్డారంటే కొద్ది రోజులు ఇల్లువదిలి బయటకు రాలేదని వార్తలు హల్ చల్ చేశాయి.తన ప్రియతముడి బాధ, ఆవేదన దగ్గరుండి చూస్తూ అక్కినేని అమల తీవ్ర ఒత్తిడికి గురైందని సమాచారం.

 
 
అలాంటిది.. కింగ్ నాగార్జున వేగంగా కోలుకున్నట్లె చెప్పాలి. ఏదైనా వ్యాపకం పెట్టుకుంటే తప్ప ఆ బాధాకరకమైన ఘటనను మర్చిపోవడం కష్టమని నాగ్‌ బావించినట్లుంది. తాను ప్రధాన పాత్రలో ఓంకార్ తీస్తున్న తాజా చిత్రం రాజుగారి కది-2లో నాగ్ పాల్గొంటున్నారు. వేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగుకు సంబంధించి నాగ్ స్వయంగా ఫోటోలు తీసి షేర్ చేశారు. 
 
పైగా.. ‘రాజుగారిగది’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘రాజుగారిగది-2’లో నటించడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున ఓ ట్వీట్లో తెలిపారు. సముద్రపు ఓడ్డున నిల్చుని దిగిన ఫొటోను షేర్‌చేస్తూ.. సుముద్రాన్ని చూస్తూ ఆస్వాదించేందుకు తాను ఎంతగానో ఇష్టపడతానని.. సముంద్రం ఎంతో అందంగా.. అంతుబట్టకుండా ఉందని మరో ట్వీట్లో కింగ్ నాగ్ రాసుకొచ్చారు.
 
సముద్రం మానవజీవితంలోని ఎగుడుదిగుడులకు ప్రతీక కదా. నిజజీవితంలో షాక్‌కు గురైన నాగార్జున సముద్రం వద్ద సేదతీరడం సహజమే..కదా.. ఈ మూవీలో నాగ్‌కు కాబోయే కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్న వార్త రాగానే అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు. 
 
కాగా, తన భర్త నాగ్ తిరిగి గాడిలో పడినందుకు అమల కాస్త కుదుటపడ్డారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతంలో స్త్రీలను ఫణంగా పెట్టి జూదమాడారు... అందుకే అత్యాచారాలు : కమల్ హాసన్