Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

Tufan First Look

డీవీ

, మంగళవారం, 11 జూన్ 2024 (17:43 IST)
Tufan First Look
ఒక అందమైన హిల్ స్టేషన్ లో మంచిగా నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులనుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే పాయింట్ తో తుఫాను హెచ్చరిక చిత్రం రూపొందుతోంది. 
 
డైరెక్టర్ జగదీష్ కె కె మాట్లాడుతూ, ఈ థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్ కి ప్రాణం పోయడం అనేది మా ప్రతిభావంతులైన తారాగణం యొక్క లక్ష్యం. మా సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న అపురూపమైన సమన్వయాన్ని నేను తప్పక హైలైట్ చేయాలి. ఆర్టిస్టులు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ సన్నివేశాన్ని చక్కని భావోద్వేగాలతో సజావుగా ప్రదర్శించారు.
 
లంబసింగి,  చింతపల్లిలోని మంచుతో కూడుకున్న పచ్చని కొండలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కథలో అంతర్భాగమైన ప్రకృతి సౌందర్యాన్ని చూపించడానికి కారణం అయ్యాయి. చిత్రీకరణను పునఃప్రారంభించడానికి మరియు ఆ అందమైన సీజనల్ వేరియేషన్ లను సరిగ్గా చిత్రీకరించడానికి మేము ఏడాది పొడవునా ఓపికగా వేచి ఉండాల్సి వచ్చింది. దాని ఫలితాన్ని మీరు త్వరలో వెండి తెరపై చూడబోతున్నారు.
 
హిల్ స్టేషన్ లో ఉండే ఆ ఫ్రెష్ నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌  లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.
 
ఈ ఉత్కంఠభరితమైన చిత్రంలో లీనమైపోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఈ చిత్రంలో ప్రతి మలుపు ఖచ్చితత్వంతో మరియు అభిరుచితో రూపొందించబడింది. ఈ చిత్రం కేవలం కథ కాదు, ఒక అనుభవం మరియు ఇది మిమ్మల్ని అలరిస్తుంది నేను నమ్ముతున్నాను. 48 గంటలలోపు టైటిల్ వెల్లడి చేయబడే ఉత్కంఠభరితమైన సమయం కోసం మీతో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్