త్రివిక్రమ్ దర్శకత్వంలో ధృవకు తర్వాత అబ్బాయ్‌తో బాబాయ్ సినిమా..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కానీ అలాంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ భావిస్తున్నాడు. త్వరలోనే అబ్బాయ్ రామ్ చరణ్‌తో బాబా
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కానీ అలాంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ భావిస్తున్నాడు. త్వరలోనే అబ్బాయ్ రామ్ చరణ్‌తో బాబాయ్ పవన్ ఓ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడని తెలిసింది.
తాజాగా యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమా ప్రారంభించిన పవన్ కల్యాణ్.. ఇంట్లో చెర్రీ వుండగా నితిన్ తో సినిమా నిర్మిస్తున్నాడంటే మెగా ఫ్యామిలీతో పవన్ కి పడడం లేదనే టాక్ వచ్చింది. నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేసే ప్లాన్‌లో వున్నాడని, త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చెర్రీతో సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు చెర్రీ.. త్రివిక్రమ్‌తో చేయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. అందుకే చెర్రీ కోరిక తీర్చడానికి త్రివిక్రమ్‌ని పవన్ కల్యాణ్ ఒప్పించినట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. రామ్ చరణ్ 'ధృవ' ఫినిష్ చేసి సుకుమార్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ప్రొడ్యూస్ చేయబోయే మూవీ వుంటుందని