Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ గీతాన్ని నైట్ క్లబ్‌లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు ఎందుకు ప్రసారం చేయకూడదు?: వర్మ

సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా తనదైన శైలిలో స్పందించారు. జాతీయగీతం థియేటర్లలోనే ఎందుకు ప్రసార

Advertiesment
జాతీయ గీతాన్ని నైట్ క్లబ్‌లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు ఎందుకు ప్రసారం చేయకూడదు?: వర్మ
, గురువారం, 1 డిశెంబరు 2016 (13:30 IST)
సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా తనదైన శైలిలో స్పందించారు. జాతీయగీతం థియేటర్లలోనే ఎందుకు ప్రసారం చేయాలని.. కస్టమర్లు దుకాణంలో అడుగెట్టే ముందు జాతీయగీతం ప్రసారం చేశాకే లోపలికి ఎందుకు వెళ్లకూడదంటూ ప్రశ్నించారు. 
 
ప్రతి టీవీ ప్రోగ్రామ్, టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌, రేడియో ప్రోగ్రామ్‌లు ఆరంభంలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రసారం చేయకూడదు? టీవీల్లో వార్తలు ప్రారంభమయ్యే ముందు.. తల్లిదండ్రులు, పిల్లలు ఉదయాన్నే నిద్రలేవగానే జాతీయగీతం పాడి దినచర్య ప్రారంభించకూడదా? అన్ని మతాల ప్రార్థనాలయాల్లో ప్రార్థనలకు ముందుగా జాతీయగీతాన్ని ప్రసారం చేయకూడదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇంకా నైట్ క్లబ్బుల్లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు జాతీయగీతం ప్రసారం చేయకూడదా అంటూ అడిగారు. ఒకవేళ జాతీయగీతంలోని సారాంశాన్ని వివరించండి అంటూ పరీక్షల్లో పేర్కొంటే నాకు తెలిసి 99 శాతం భారతీయులు ఫెయిలవుతారు. మన రాష్ట్రీయ భాష హిందీకి చాలా వెర్షన్లు ఉన్నప్పుడు భారతీయులకు అర్థమయ్యేలా జాతీయగీతాన్ని అన్ని వెర్షన్‌లలోనూ విడుదలచేయకూడదా?' అంటూ ట్వీట్ల ద్వారా తనదైన శైలిలో ప్రశ్నలు వేశారు రామ్ గోపాల్ వర్మ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ కుమార్తెకు మంచి పేరు చెప్తారా? కండీషన్.. 'ఏ' అక్షరంతో పేరుండాలి