Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్‌ కూడా అలాంటివారేనా...?

మాటలతో కోటలు కట్టే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి తెలియంది కాదు. పంచ్‌ డైలాగ్‌లతో అల్లాడించే ఆయన తాజాగా నితిన్‌తో 'అ..ఆ.' సినిమా తీశాడు. ఆ చిత్ర కథ కొత్తదేమీ కాదు. రొటీన్‌ కథే. అయితే ఆ కథ కూడా దొంగిలించిందేననే గొడవ మొదలైంది. అందుకే రచన, దర్శకత్

Advertiesment
director trivikram
, మంగళవారం, 7 జూన్ 2016 (14:43 IST)
మాటలతో కోటలు కట్టే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి తెలియంది కాదు. పంచ్‌ డైలాగ్‌లతో అల్లాడించే ఆయన తాజాగా నితిన్‌తో 'అ..ఆ.' సినిమా తీశాడు. ఆ చిత్ర కథ కొత్తదేమీ కాదు. రొటీన్‌ కథే. అయితే ఆ కథ కూడా దొంగిలించిందేననే గొడవ మొదలైంది. అందుకే రచన, దర్శకత్వం అని పేరు పెట్టుకున్నారని అంటున్నారు. అసలు మూల కథ.. యద్దనపూడి సులోచనరాణి నవల మీనాను ఎత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కథను అటూఇటూ మార్చేసి సినిమాగా తీశారని చర్చ జరుగుతోంది.
 
ఈ విషయం బయటపడి.. ఆమె కేసు వేస్తుందని తెలుసుకుని... సినిమా విడుదలైన 48 గంటల తర్వాత ఆమె పేరును స్లైడ్‌లో వేయడం విశేషం. సినిమా విడుదలకు ముందు సొంత కథగా ఫోజులు కొట్టి.. అటుచేసి ఇటుచేసి... చివరికి కథలు దొంగతనం చేయడం మామూలైపోయిందని టాలీవుడ్ జనం అనుకుంటున్నారు. పేరు మోసిన రచయిత కథ కాబట్టి బయట పడింది. లేదంటే అంతే అంటున్నారు. చాలామంది కొత్త రచయితలు చెప్పుకోలేని పరిస్థితి. త్రివిక్రమ్‌ కూడా ఇలా చేయడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. తను కూడా 'అ...ఆ..'తో కాపీ డైరెక్టర్‌గా పేరు పొందేశాడని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత-నాగచైతన్య లవ్వాయణానికి నాగ్ అడ్డు.. గిఫ్ట్ ఇచ్చేందుకు చైతూ ప్లాన్.. ఏంటది?