Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత-నాగచైతన్య లవ్వాయణానికి నాగ్ అడ్డు.. గిఫ్ట్ ఇచ్చేందుకు చైతూ ప్లాన్.. ఏంటది?

Advertiesment
Naga Chaitanya
, మంగళవారం, 7 జూన్ 2016 (14:40 IST)
సమంత-నాగచైతన్య లవ్వాయణంపై అక్కినేని హీరో నాగార్జున యాంటీగా ఉన్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నాగార్జున వారిద్దరి ప్రేమను ఎలా బ్రేక్ చేయాలా అని ఆలోచిస్తుంటే.. పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని సమంత-నాగచైతన్య పట్టుబట్టి కూర్చున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ విషయమై తండ్రీకుమారుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని టాక్. ఈ వ్యవహారమే వారిద్దరి మధ్య దూరాన్ని సైతం పెంచిందని సినీ జనం అనుకుంటున్నారు. 
 
కానీ సమంతను పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియరయ్యేందుకు.. ఇంకా తండ్రికి తనకు మధ్య ఎలాంటి దూరం లేదని నిరూపించేందుకు నాగచైతన్య ఓ కానుకను తండ్రికి సిద్ధం చేసుకున్నాడట. జూన్ 11న నాగ్-అమల పెళ్లి రోజు. ఆ రోజున తన తాజా చిత్రం 'ప్రేమమ్' టీజర్‌ను విడుదల చేయాలని చైతూ ప్రయత్నిస్తున్నాడు. అలా చేస్తే తండ్రికి తనకు గ్యాప్ ఏర్పడలేదని అందరని నమ్మించవచ్చునని ప్లాన్ చేస్తున్నాడు. 
 
కాగా ప్రేమమ్ సినిమాని ఆగస్టు 12న ఎలాగైనా విడుదల చేసేందుకు సినిమా సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిల్ రాజు జారుకున్నారు... కబాలి 'కత్తి'లా ఉంటుందా...? 'సుత్తి'లా ఉంటుందా...?