పెన్సిలివేనియాలో కారు నంబర్ ప్లేటుపై త్రిష పేరు.. సంబరిపడిపోతున్న భామ..
సినీనటులపై అభిమానులు చూపించే అభిమానానికి ఒక్కోసారి హద్దులుండవు. తమ అభిమానుల నటులకు గుడి కట్టించడం, కొత్త సినిమాలు విడుదలైతే పాలాభిషేకం చేయడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు.
సినీనటులపై అభిమానులు చూపించే అభిమానానికి ఒక్కోసారి హద్దులుండవు. తమ అభిమానుల నటులకు గుడి కట్టించడం, కొత్త సినిమాలు విడుదలైతే పాలాభిషేకం చేయడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొంతమంది అభిమానులైతే తమ పిల్లలకు నటీనటుల పేర్లు పెట్టుకోవడం, పేర్లు పచ్చ పొడిపించుకోవడం ఇలాంటివి చేసి అభిమానాన్ని తెలియజేస్తారు. ఇలాంటి కోవకు చెందిన ఒక అభిమాని తన కారు వెనుక నెంబర్ ప్లేట్‌పై నెంబర్ బదులు త్రిష అనే పేరు రాయించుకున్నాడు.
అది కూడా పెన్సిలివేనియా రాష్ట్రంలో కనిపించింది. ఆ కారు ఫోటోని ఈ భామ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసి తెగ సంబరపడిపోతోంది. విదేశంలో కూడా తన పేరుని ఇలా కారుపై రాయించడం చాలా అందంగా ఉందంటూ, వారికి ధన్యవాదాలు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కారు నెంబర్ ప్లేట్‌పై తమకు నచ్చిన పేరును రాయించుకునే వీలుంది. ఈ క్రమంలోనే కారు ప్లేట్‌పై త్రిష పేరు దర్శనమిచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.