Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్.. లావణ్య త్రిపాఠీ జంటగా...

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్. ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానరుపై వరుస విజయాలతో సోలో హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్న శర్వానంద్‌తో ఆయన 25వ సినిమాని నిర్మిస

Advertiesment
వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్.. లావణ్య త్రిపాఠీ జంటగా...
, శుక్రవారం, 10 జూన్ 2016 (15:38 IST)
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్. ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానరుపై వరుస విజయాలతో సోలో హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్న శర్వానంద్‌తో ఆయన 25వ సినిమాని నిర్మిస్తున్నారు.
 
విన్నూత్నమైన కథలతో, మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారు. 
 
శర్వానంద్ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతంలో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈ నెల 15 నుండి ప్రారంభం అవుతుంది.
 
 
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ "పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ, ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది" అని అన్నారు. 
 
ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. టైటిల్‌ను, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలుపుతాం అని, ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12న గుంటూరులో వైభవంగా 'అ..ఆ...' విజయోత్సవ వేడుక