Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు... అనారోగ్యంతో చెన్నైలో మృతి

Advertiesment
Costume Krishna
, ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (10:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖు నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నై టి నగర్, పార్థసారథిపురం, భారతీ మూడో వీధిలో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 
 
విలన్‌గా, సహాయ నటుడుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన కాస్ట్యూమ్ కృష్ణ.. తన సినిమా కెరీర్‌లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్‌లో ఆయన అనేక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. 
 
ఆ తర్వాత డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "భారత్ బంద్" చిత్రంలో నటుడిగా మారారు. ఆ తర్వాత 'పెళ్లాం చెబితే వినాలి', 'అల్లరి మొగుడు', 'దేవుళ్లు', 'మా ఆయన బంగారం', 'పుట్టింటికి రా చెల్లి' వంటి హిట్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, ఆలరించాడు. 
 
నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కృష్ణ సినినా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జగపతిబాబు హీరోగా నటించిన "పెళ్లి పందిరి" చిత్రాన్ని ఈయనే నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కన్నడంలో సూపర్ హిట్ అయిన "అరుంధతి" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. నిర్మాతగా ఆయన సుమారుగా ఎనిమిది చిత్రాలు నిర్మించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకింగ్ న్యూస్ - ఏపీలో అసెంబ్లీ రద్దు