Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రా నాదే... తెలంగాణా నాదే... ఇదే మాట మీదుంటా.. నువ్వు చెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీటు

Advertiesment
ఆంధ్రా నాదే... తెలంగాణా నాదే... ఇదే మాట మీదుంటా.. నువ్వు చెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీటు
, బుధవారం, 30 జనవరి 2019 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా కార్ల తయారీ కంపెనీ నుంచి తొలి కారు బయటకు వచ్చింది. ఈ కారును ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేశారు. దీనిపై అనేక మంది ట్వీట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో రామ్ పోతినేని ఒకరు. రామ్ చేసిన ఒక్క ట్వీట్‌పై అనేక మంది నెటిజన్లు ఆయన్ను అభినందించారు. 
 
తాను చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై రామ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నా ఇల్లు సక్కపెట్టేడోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్... నువ్వుచెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే.. తెలంగాణా నాదే. ఇదే మీట మీదుంటా. ఇక్కడ కులం లేదు. మతం లేదు.. ప్రాంతం లేదు. డిస్కషన్ అస్సలే లేద్' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
'రీల్ హోరీ మాత్రమే కాదు.. రియల్ కూడా. రీల్ హీరోలంతా రామ్‌ను చూసి నేర్చుకోవాలి' అని కొందరంటే.. 'నీవు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనక్కర్లేదు' అంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. 
 
అంతర్జాతీయ కార్ల సంస్థ మన దగ్గర స్టార్ట్ చేశారు అని తెలుగువాళ్లందరం గర్వపడే సందర్భంలో పోస్ట్ పెట్టి విష్ చేసిన మీకు మొదటగా అందరి తరుపున ధన్యవాదాలు రామ్ గారు.. దీంట్లో కూడా కులం - ప్రాంతం చూస్తున్న వారికో నమస్కారం. అరేయ్ భయ్ పార్టీలు పక్కన పెట్టి మంచిని అభినందించండిరా' అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే సినిమా వాళ్లంతా వెళ్లి అభినందించారు. ఆనాడు లేవని గొంతులు నేడు బాబుగారిని ఒకడు అభినందిస్తే ఎందుకంతబాధ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. మొత్తానికి రామ్ మాత్రం తన ట్వీట్‌తో ఎన్నో హృదయాలను గెలిచేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వై.ఎస్ బ‌యోపిక్‌కి యాత్ర అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం..?