Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ రెడ్డి స్టైల్‌లో తన ప్రియురాలిని పరిచయం చేసిన కమెడియన్

Advertiesment
rahul ramakrishna
, ఆదివారం, 8 మే 2022 (13:48 IST)
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. తనకు కాబోయే భార్యను లిప్ లాక్ ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు. 
 
అయితే, ఆ పెట్టిన ఫొటోనే ఇప్పుడు నెట్టింట్లో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. కొందరు రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు ఆయనకు అండగా నిలుస్తున్నారు.  
 
తనకు కాబోయే భార్యకు ముద్దుపెట్టే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎట్టకేలకు తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాహుల్ ప్రకటించాడు. అయితే, ఆ ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
'ఇప్పుడు ముద్దులు పెట్టే ఫొటో పోస్ట్ చేశారు.. రేపు బెడ్ సీన్స్ పెడతారా?' ఏంటి అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. కొంచెం ఇమేజ్ వస్తే చాలు ఇలా దిగజారిపోవడమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను మంచి కొడుకును కాదు మమ్మీ... ఆర్జీవీ ట్వీట్