Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీవీ9, నాగవల్లిపై ఫైర్ అయిన రాహుల్ రామకృష్ణ.. విశ్వక్‌కు సపోర్ట్

Advertiesment
Rahul Ramakrishna
, గురువారం, 5 మే 2022 (09:29 IST)
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" ప్రమోషన్స్‌కి ప్లాన్ చేసుకున్న ప్రాంక్ ఏటో వెళ్లి ప్రముఖ మీడియా ఛానెల్‌తో యుద్ధానికి దారితీసింది. తాజాగా ఈ వ్యవహారంపై ఆర్ఆర్ఆర్ నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
డైరెక్ట్‌గా అధికారిక టీవీ9 హ్యాండిల్‌ని ట్యాగ్ చేసి మరీ ఈ ఛానెల్ యొక్క నీచ స్వభావం కోసం ఎవరూ మాట్లాడారు. ఈ టీవీ9 వాళ్ళు న్యూస్ తప్ప అన్నీ చూపిస్తారని వాళ్ళకి బాగా ఫండ్స్ వస్తుంటాయి.
 
అందుకే ఇలా అనవసర విషయాలను బూతద్దాల్లో పెట్టి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారని, వారి వార్తలు కేవలం డబ్బుకి సంబంధించినవే తప్ప ప్రజల కోసం ఎలాంటి ఉపయోగపడే వార్తలు చూపించకపోవడం సిగ్గు చేటు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే తాను విశ్వక్ సేన్ కి పూర్తి మద్దతు ఇస్తున్నానని బాహాటంగానే ఆ ఛానెల్ పై ఈ నటుడు సంచలన కామెంట్స్ చేసాడు.
 
విశ్వక్ సేన్‌ను టీవీ 9 అవమానించిన విధానాన్ని ఖండిస్తున్నాను.. నేను అతడికి సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. జర్నలిస్ట్‌లు అనే ముసుగులో వారేం చేస్తున్నారో నాకు తెలియడం లేదు అని కౌంటర్ వేశాడు.
 
రాహుల్ రామకృష్ణ వేసిన ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అందరూ కూడా రాహుల్ రామకృష్ణ చెప్పంది కరెక్ట్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్స్ తరహా ఘటన పునరావృతం.. స్టేజీ మీద మరో కమెడియన్‌పై దాడి (Video)