సహజీవనం చేశాడు.. పెళ్లికి నో అన్నాడు.. 'పక్కా ప్లాన్' హీరో అరెస్టు
హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన ఈ హీరో నిజజీవితంలోనూ పక్కా ప్లాన్‌తో ఓ హీరోయిన్‌ను మోసం చేశాడు. పెళ్లి పేరుతో సహజీవనం చేసి..
హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన ఈ హీరో నిజజీవితంలోనూ పక్కా ప్లాన్‌తో ఓ హీరోయిన్‌ను మోసం చేశాడు. పెళ్లి పేరుతో సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమిట్కల్ మండలం మాడేపల్లి గ్రామానికి చెందిన నగేష్‌యాదవ్ (28)కు సినిమాలలో నటించడం ఇష్టం. తన కృషి ఫలితంగా శ్రీకృష్ణనగర్‌కు చెందిన అల్లబోయిన ఫణీశ్వర్(32) నిర్మించిన ‘పక్కా ప్లాన్’ అనే చిత్రంలో సెకండ్ హీరోగా నగేష్ యాదవ్, రెండో హీరోయిన్‌గా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాణి(29) నటించారు. గతేడాది సెప్టెంబరులో చిత్రం విడుదలైంది.
ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు మాదాపూర్‌లో కలిసి సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే, అప్పటికే వివాహమై తొలి భర్తతో విడాకులు తీసుకున్న నాగరాణికి ఆరేళ్ల పాప ఉంది. అయినా ఆమెను పెళ్లి చేసుకుంటానని నగేష్‌యాదవ్ నమ్మించాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో నాగరాణి అతన్ని నిలదీసింది. ఎంతకూ వినకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. గురువారం నగేష్‌యాదవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.